సరిగ్గా 10 సంవత్సరాలు కోసం క్రితం ఏపీలో ఓ నూతన పార్టీ ఏర్పడింది. దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగు పెట్టింది. వైఎస్‌ఆర్ హఠన్మారణంతో తెలుగు రాష్ట్రం తల్లడిల్లింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక అనేక వందల మంది ప్రాణాలు వీడటం జరిగింది. తన తండ్రి చనిపోయరనే బాధతో మృతి చెందిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడం తన బాధ్యత అని చెప్పి ఓదార్పు యాత్రను మొదలు పెట్టారు జగన్. ప్రజలు రాజన్నా బిడ్డను తమ బిడ్డగా భావించారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. జగన్‌కు జనాలు నీరాజనాలు పట్టారు. అయితే జనంలో జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోయింది. జగన్ ఓదార్పు యాత్రకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు.

హైకమాండ్ కూడా జగన్‌ను లైట్ తీసుకుంది. జగన్ తన ఓదార్పు యాత్రను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. జగన్ కూడా పార్టీ మీద నమ్మకం ఉండటంతో కొన్నాళ్లు ఓదార్పు యాత్రను వాయిదా వేశారు. తన తల్లి విజయమ్మతో కలిసి ఢిల్లీ వెళ్లి మరి తన ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వమని సోనియా గాంధీని కోరారు. జగన్ ఎంత చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు. కొన్నాళ్లు వేచి చూసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మార్పు లేదు. దీంతో తన దారి తాను చూసుకున్నారు జగన్ . తన తండ్రి చనిపోయారనే బాధతో చనిపోయిన అభిమానులను పరామర్శించడానికి పర్మిషన్ తీసుకోవడం ఏంటని ఆయనకు ఆయనే ప్రశ్నించుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు జగన్.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కొనసాగించడం కోసం జగన్ సొంతంగా పార్టీ పెట్టక తప్పలేదు. తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు జగన్ సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు క్రితం ఇదే రోజున 2011లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ పేరును ప్రకటించారు. జగన్ పార్టీ స్థాపించిన సమయంలో కేవలం వారిద్దరు మాత్రమే పార్టీలో ఉన్నారు. విజయమ్మ ఎమ్మెల్యేగా, జగన్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అప్పటికీ కాని ఆయన స్టామినా ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలిసి రాలేదు. జగన్‌‌కున్నా క్రేజ్‌ను చూసి పలు పార్టీ నాయకులు వైసీపీలో చేరడం జరిగింది. టీడీపీ , కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరడం చూసి ఆ పార్టీలకు భయం పట్టకుంది.

జగన్‌ను ఇలాగే వదిలిస్తే తమ పార్టీలు మనుగడ సాధించలేవని భావించాయి ఆ రెండు పార్టీలు. కాంగ్రెస్ పార్టీతో జత కలిసి చంద్రబాబు కూడా జగన్‌పై అక్రమ కేసులను బనాయించి ఆయన్ను జైలుకు వెళ్లేలా చేశారు. 16 నెలలు పాటు జగన్‌కు బైయిల్ రాకుండా చేశారు. అయినప్పటికి కూడా జనంలో జగన్‌కున్నా అభిమానాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయారు. వైఎస్ఆర్ చనిపోవడం , జగన్ జైలుకు వెళ్లడంతో ఆ ఇంటి ఆడవారిని నడిరోడ్డు మీదకు తీసుకువచ్చినట్లూయింది. అయిన్నప్పటికీ కూడా వారిలో ధైర్యాన్ని ఏమాత్రం కదిలించలేకపోయారు. పార్టీ బాధ్యతలను తీసుకుని జనంలోకి వెళ్లారు షర్మిల. రాజన్న బిడ్డగా, జగన్ అన్న వదిలిన బాణంగా ప్రజల్లో దూసుకుపోయారామె. మరో ప్రజ ప్రస్థానం పేరిట షర్మిల చేసిన పాదయాత్ర వైసీపీ పార్టీకి ఊపిరిపోసినట్లూయింది. పార్టీ ఈ రోజున ఇలా నిలబడటానికి ఆమె కూడా ఓ కారణమనే చెప్పాలి. తరువాత కొంతకాలనికి జగన్ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన బాధతోనే ఎన్నికలకు వెళ్లారు జగన్.

రుణమాఫీ, పొత్తులు పెట్టుకుంటేనే ఎన్నికల్లో గెలుస్తామని ఎంతమంది నాయకులు చెప్పినప్పటికి కూడా ఆచరణ కాని హామీలను తాను ఇవ్వలేనని చెప్పి 2014 ఎన్నికలు వెళ్లారు. బీజేపీ, టీడీపీ , జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎంగా గెలిచారు. 68 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్షంలో కూర్చోంది. అయినప్పటికి కూడా తన దృఢ సంకల్పాన్ని మాత్రం వదిపెట్టలేదు జగన్. ప్రజల తరుఫున నిత్యం పోరాటాలు జరిపారు. తన పార్టీ నుంచి 23 ఎమ్మెల్యేలను కొనుగొలు చేసినప్పటికి కూడా జగన్ భయపడలేదు. నేను ప్రజల మనిషిని , ప్రజలతోనే తేల్చుకుంటానని చెప్పి , ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇంత వరకూ ఇంతటి భారీ పాదయాత్రను చేసింది దాఖలాలు లేవు. దాదాపు సంవత్సరం పాటు కుటుంబానికి, భార్య, పిల్లలకు దూరంగా ఉండి తన పాదయాత్రను కొనసాగించారు. తన పాదయాత్రలో ఎన్ని అటుపొటులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు సాగారాయన.

ప్రజల కష్టలను తెలుసుకుంటూ వారికి నేనున్నాను అనే నమ్మకాన్ని కలిగించారు జగన్. పాదయాత్రలో తనపై హత్యయత్నం జరిగినప్పటికి కూడా దానిని పెద్దగా లెక్క చేయలేదు. తన పాదయాత్రతో ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించారాయన. ఆ నమ్మకమే ఆయన్ని ఈ రోజు సీఎం కూర్చీలో కూర్చోపెట్టింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. 175 సీట్లగానూ 151 సీట్లలో వైసీపీ జెండా ఎగిరింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో పార్టీ మొదలు పెట్టిన జగన్ ఈ రోజు 151 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. పార్లమెంట్‌లో 3 అతి పెద్ద పార్టీగా వైసీపీ నిలిచిందంటే దాని వెనుక జగన్ పడిన కష్టం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాను సీఎం అయిన దగ్గర నుంచి నిత్యం ప్రజల మంచి గురించే ఆలోచిస్తురాయన. ఎన్నికల సమయంలో తాను ఏదైతే చెప్పారో అదే ఆచరణలో చేసి చూపిస్తున్నారు. తాను సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం దేని కోసం అయితే పార్టీని స్థాపించారో, ఇప్పుడు దానిని సాధించగల్గుతున్నారు. రాజన్న ఆశయాలను కొనసాగించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు జగన్. తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ విజయం జగన్ ఒక్కరిదే కాదు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తది. ఇది జగన్ జెండా… ఇదే ప్రజల ఏజెండా.