వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఆమె తెలంగాణలో కొత్తపార్టీ పెట్టాడానికి రెడీ అవుతున్నారు. కొత్తపార్టీతో ప్రజల ముందుకు రావడానికి సన్నద్దం అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా నాయకులతో ఆత్మీయ సమేళనాలు జరిపారు షర్మిల. కొత్తపార్టీ పెడితే ఎలా ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఏం సమాధానం చెప్పాలి…ప్రజలకు ఎటువంటి భరోసా కల్పించాలి అని ఈ రెండు జిల్లాలో నాయకులతో చర్చించారు షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాల్సిన సమయం వచ్చిందంటూ మీడియాతో చెప్పుకొచ్చారామె.

ఇక బుధవారం యూనివర్సిటీ విద్యార్థులతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణలో వైఎస్ఆర్ హయంలో విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి వారిని ఆదుకున్నారు. ఆయన మరణించిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పోడిచారు. తెలంగాణ వచ్చిన తరువాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. విద్యార్థులతో భేటీ అనంతరం.. మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన అన్న ఏపీ సీఎం జగన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వైఎస్ షర్మిలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. వైఎస్ఆర్ తనయురాలుగా, వైఎస్ జగన్ సోదరిగా వైఎస్ షర్మిల అందరికి సుపరిచితమే. పార్టీలో ఏ పదవి లేకపోయినప్పటికి కూడా వైసీపీ గెలుపు కోసం కృషి చేశారు షర్మిల. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్న, చెల్లెలకు చేడిందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాని తాజాగా షర్మిల చేసిన కామెంట్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడిన షర్మిల పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పార్టీ పెట్టడం తన అన్న జగన్‌కు ఇష్టం లేదని తెలిపారు షర్మిల. అమ్మ విజయమ్మ మద్దతుతోనే తాను పార్టీ పెడుతున్నానని స్పష్టం చేశారు.

వైసీపీలో తనకు ఎటువంటి పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌ను అడగండి అంటూ కుండబద్దలు కొట్టేశారు. అన్నతో విభేదాలు అని చెప్పలేని కాని.. భిన్నఅభిప్రాయాలు అని మాత్రం చెప్పగలను అని చెప్పుకొచ్చారు షర్మిల. ఇలా తన అన్నతో ఉన్న విభేదాలు గురించి షర్మిల మీడియాతో పంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల వైసీపీకి దూరంగా ఉంటే అది ఖచ్చింతగా పార్టీకి నష్టం కలిగిస్తుందని నాయకులు భావిస్తున్నారు. మరి అన్న, చెల్లెలు మధ్య పోరు ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.