బహుశా 2018 అక్టోబర్ కానీ నవంబర్ లో కానీ యాత్రా మూవీ డైరెక్టర్ Mahi V Raghav , పాదయాత్రలో జగన్ ని కలిశారు . పాదయాత్రలో కీలక ఘట్టాలు , ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాల అప్పటి వరకూ తీసిన ముఖ్య ఘట్టాల వీడియో క్లిప్స్ జగన్ కి చూపించారు పెర్మిషన్ కోసం. ఆ వీడియో క్లిప్స్ లో వైఎస్సార్ హయాంలో జరిగిన రైతు రుణమాఫీ కూడా ఉంది. క్యాజువల్ గా చూసిన జగన్ మరో సారి రివైండ్ చేయమని మళ్లీ చూసి డైరెక్టర్ నుద్దేశించి ఒకటే చెప్పారు.

“మహీ ఈ రైతు రుణమాఫీ నాన్న చేసింది కాదు . కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ సీన్ తీసేయండి”

“సర్ పబ్లిక్ మొత్తం వైఎస్ఆర్ గారు చేశారనే అనుకొంటున్నారు. మాఫీ వర్తించని వారికి ఐదు వేలు ప్రోత్సాహకంగా ఖాతాలో వేశారని కూడా మా సర్వేలో చెప్పారు”.

“ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది కాబట్టి వాళ్ళు అలా అనుకోని ఉండొచ్చు . కానీ రుణమాఫీ చేసింది కేంద్రమే , మనం చేయనిది ఏదీ కూడా మనం చేసాము అని చెప్పుకోవటం చాలా నీచమైన పని . మీరు వెంటనే ఈ సీన్స్ తీసేయండి . ఆయన చేయని పని ఏదీ కూడా నాన్నగారికి ఆపాదించొద్దు . ఫైనల్ ఐనాక నాకు మరోసారి చూపించండి” .. అని చెప్పి ఆ సీన్స్ డిలీట్ చేయించారు . ఇదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే , ఇదీ వైఎస్సార్సీపీ నాయకుడి విశ్వసనీయత … అలాంటి నాయకుడి తరుపున సోషల్ మీడియా వాలంటీర్ గా చేయాలన్నా అర్హత అని కాకపోయినా ఓ నిజాయితీ , నిబద్ధత ఉండాలి . ఒక విషయాన్ని ప్రచారం చేసే ముందు అది నిజమో కాదో చెక్ చేసుకోవాలి .

రెండ్రోజుల క్రిందట ఎక్కడో తెలంగాణలో ఓ వలస కార్మిక సమూహానికి కొందరు మానవత్వంతో కొన్ని సేవా కార్యక్రమాలు , భోజనం ఏర్పాట్లు చేశారు . అందులో ఓ పసిపాప నవ్వుతూ భోజనం చేస్తున్న ఫోటోని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొన్నారు . ఆ ఫోటోని కొందరు తీసుకొచ్చి ప్రచార కండూతితోనో , ఎవరూ పోస్ట్ చేయని మేటర్ కాబట్టి నాలుగు లైకులు వస్తాయనో కక్కుర్తిపడి … వైసీపీ పార్టీ వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేసింది . ఆ పాప ఆనందంగా తింటుంది అని పోస్ట్ చేశారు . దాన్ని నిజమే అనుకోని మరికొందరు షేర్ చేశారు . చివరికి ఏమైంది , ఆ ఫ్రోగ్రామ్ చేసిన వారు ఇది మాది వైసీపీది కాదు అన్నారు . అంతిమంగా మీరు వైసీపీకి మేలు చేశారా కీడు చేశారా ? .

ఇవాళ నలుగురికి అన్నం పెట్టి పోస్ట్ చేసుకొంటేనే వైసీపీకి గుర్తింపా ??? .

వైసీపీ ప్రవేశ పెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అమలు జరుగుతున్నాయా ?
రైతు భరోసా, అమ్మవడి, నాడునేడు, గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి, ఫీజ్ రీ ఎంబర్స్మెంట్, మిడ్ డే మీల్ హెల్తీ చార్ట్ , gov స్కూల్స్ లో ఇంగిలీష్ మీడియం ప్రవేశపెట్టే ప్రయత్నం , వైఎస్సార్ ఆసరా పింఛన్ పధకం , వైఎస్సార్ చేయూత , 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ,ఇలా ఎన్నో పథకాలు ఉండగా మరొకరు చేసిన దానానికి మనకి క్రెడిట్ కావాలా ??? .

విలేజ్ వలంటీర్ , గ్రామ సచివాలయాలు , దిశా చట్టం , దిశా పోలీస్ స్టేషన్లు , రైతు భరోసా కేంద్రాలు , ఉద్యాన , మార్కెటింగ్ శాఖల ద్వారా పంట కొనుగోళ్లు లాంటి సరికొత్త వ్యవస్థలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారుతున్న ముఖ్యమంత్రికి ఎవరో దానం చేసిన ఒక పసిబిడ్డ మీల్ ప్రచారానికి కావాలా ????. జాతీయ రహదారుల వెంట వలస వెళుతున్న కూలీల్ని కేంద్రం వారి మానాన వారిని వదిలేస్తే ఆ కూలీలా కష్టాలు చూసి వారికి ఆహారం , వసతి ఏర్పాటు చేసి కేంద్రంతో సమన్వయం చేసుకొని వారు నడుపుతున్న రైళ్లలో పంపే ఏర్పాట్లు చేసింది మొదట మన రాష్ట్రమే అనుకొంటా లేదా బహుశా రెండోదో మూడోదో అయ్యుండొచ్చు .

ఏదేమైనా ఆ వలస కార్మికులు మన రాష్ట్రం వారు కాదు . మన ఓటర్లూ కాదు . లాక్ డౌన్ కారణంగా ఇక్కట్లు పడ్డ సాటి మానవులు , వారికి ఏదైనా మానవతా ధర్మంగా ప్రభుత్వం సహాయం చేస్తే దాన్ని మనం ప్రచారానికి వాడుకోవాల్సిన పని లేదు . వీలైతే మీరు కూడా వ్యక్తిగతంగా సహాయం చేయండి . అంతే కానీ వైసీపీది కానీ పని వైసీపీకి ఆపాదించొద్దు . ఉన్నతమైన వైసీపీ సంస్కారానికి మీ పిల్ల చేష్టలతో మకిలి అంటించొద్దు . నిబద్ధత గల వైసీపీ కార్యకర్తలు వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి కల్పించొద్దు  వైసీపీ వలంటీర్ గా పని చేయబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గురించి , వైసీపీ గురించి తెలుసుకొని నిబద్ధతతో పని చేయండి .

Note : ఈ అకౌంట్ ఎవరిది అని ఆరా తీయగా దంతులూరి కృష్ణ గారి వ్యక్తులకు, అభిమానులకు సంబంధించినది కాదు . ఎవరో ప్రయివేట్ వ్యక్తులు ఆపరేట్ చేస్తున్న అకౌంట్ అని తెలిసింది . ఈ పోస్ట్ కళాసాగర్ రెడ్డి వింతా గారి వాల్ నుండి.