లాక్ డౌన్ విధులలో భాగంగా జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు ఏర్పేడు ప్రాంతాలను కలయ తిరుగుతూ ఉండగా ఏర్పేడు – వేంకటగిరి రహదారి ప్రక్కన పొలములో కొంత మంది రైతులు, రైతు కూలీలు పంట పొలములో వరి నార్లు నాటుతూ ఉండగా ఇది గమనించిన జిల్లా యస్.పి వెంటనే తన వాహనము ఆపి రైతు కూలీల వద్దకు వెళ్లి వారి యొక్క యోగ క్షేమాల గురించి అడుగుతూ ముచ్చటిస్తూ అదే సమయంలో తానూ కూడా రైతు కూలీగా పోలీస్ అనే పదాన్ని కొద్ది సమయం ప్రక్కన పెట్టి మమేకమై తానూ కూడా రైతు కూలీగా మారిపోయారు. వారి వద్ద నుండి వరి నారు కట్టాను తీసుకొని తానూ కూడా పొలములో నాటడం మొదలెట్టారు. ఇది గమనించిన మిగతావారు కూడా మిక్కిలి ఆనందంతో యస్.పి వారితో కలసి వారి నార్లు నాటారు.

ఈ సందర్భంగా యస్.పి వారిని ప్రశ్నించగా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మా నాన్న మా తాతల కాలం నుండి కూడా ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. నేను అగ్రికల్చర్ బి.యస్.సి విధ్యాబ్యాసం చేసాను. నేను కూడా రైతు బిడ్డనే, మన మందరం ఈ రోజు మంచి ఆహారం తీసుకుంటున్నామoటే అది కాయా కష్టం పడి పండిస్తున్న రైతులవల్లే. ప్రపంచమంతా మహమ్మారి కమ్మేసి వున్న సమయంలో కూడా పచ్చని గ్రామ వాతావరణంలో చిరు నవ్వుతో తన కష్టాన్ని మరచి రైతులు కష్ట పడటం చూస్తూ వుంటే చాలా ఆచర్యంగా ఉంది. వారికి నా జోజార్లు. వ్యవసాయం అనేది ఎవరో చదువురానివారు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారు చేసే పని అని అనుకుంటున్నారు, అదికాదు. మంచి ఆహారం – మంచి ఆరోగ్రం – మంచి దేశం అనే ధ్యేయంతో మనమందరం వారికి తోట్పాటును ఇవ్వాలి. స్థాయితో సంబంధం లేకుండా మన మందారం మంచి ఆహారం తింటున్నాం. మనలో సహాయం చేసే వారు కూడా ఉన్నారు. నా సూచన ఏమిటంటే ఇతరాత్ర బయటి ప్రాంతాలలో పనుల మీద గాని, ఉద్యోగంలో గానీ ఉన్న వారు సంవత్సరంలో కొన్ని రోజులు తన సొంత ఊరికి వచ్చి గాని, మీ చుట్టూ ప్రక్కల గ్రామాల రైతుల వద్దకు వెళ్లి వారి బాధ సాధకాలను తెలుసుకొని మనవంతు సహకారం అందిస్తే బాగుంటుంది. వీలైతే వారాంతరపు దినాలలో సినిమాలకు, షికార్లకు పోయే బదులు మీ సొంత గ్రామాలకు వెళ్లి రైతాంగానికి తోత్పాటునిస్తే సంతోషంగా ఉంటుంది. ఇలా జరిగితే ప్రతి ఊరు పచ్చగా ఉందటే కూకుండా వ్యవసాయ రంగ భలోపిథమవుతుంది. రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయుత, భరోసాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. చదువుకున్న యువత రైతాంగం మీద దృష్తి చాదిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేనే కాదు నా బిడ్డలు కూడా రాబోయే కాలంలో వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు ఇలా ఇక్కడ రైతులు, రైతు కూలీలను కలుసుకోవడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. రైతులకు ఏ కష్టం వచ్చినా నా పరిది మేరకు సహాయం చేస్తానని సమదానమిచ్చారు.

అనంతరం రైతు కూలీలకు నిత్యావసర వస్తువులతోపాటు పండ్లు, కూరగాయలు అందజేశారు.