• అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు 55 నిమిషాల్లోనే అందనున్నాయి……
  • ఇందుకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా 100 కిట్‌లను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలనకు పంపింది…..
  • వాటి పనితీరును ఐసీఎంఆర్‌ పరిశీలించి, వినియోగానికి అనుమతించిందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు…
  • ఏఎంటీజడ్‌లోని రెండు పరిశ్రమలు ఈ కిట్‌ల తయారీని ప్రారంభించాయి…..
  • ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు రావటంతో ఉత్పత్తిని పెంచనున్నాయి. కొద్దిరోజుల్లో సుమారు 500 టెస్టింగ్‌ కిట్‌లను సీఎం చేతులమీదుగా ప్రారంభించే అవకాశముంది…..
  • నెలరోజుల్లో 25వేల కిట్‌లను తయారుచేస్తారని పరిశ్రమల శాఖ అధికారి తెలిపారు…..