• APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
  • ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది.
  • పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.
  • ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి.
  • మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టేస్తుందని అధికార వర్గాల సమాచారం.
  • వివరాల్లోకెళితే.. ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
  • ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది.
  • సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
  • ఏసీ బస్సుల బుకింగ్స్‌ను మాత్రం నిలిపివేసింది. అది కూడా విజయవాడ బస్టాండ్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే ప్రారంభించింది.
  • 115 సర్వీసులకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఆర్టీసీ.. కరోనా ప్రభావం తగ్గితే దశల వారీగా బస్సుల బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది.