ఏపీ సీఎం జగన్ అంటే టీడీపీ నాయకులకు, ఎల్లో మీడియాకు ఎంత ప్రేమో అందరికి తెలిసిన విషయమే. టీడీపీ నాయకులు తమ నాయకుడు చంద్రబాబును కూడా అన్నిసార్లు తలుచుకుని ఉంటారో లేదో తెలియదు కాని , వైఎస్ జగన్ మాత్రం కొన్ని వందల , వేల సార్లు తలుచుకుని ఉంటారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన్ను తీటడమే పనిగా పెట్టుకునేవారు టీడీపీ నాయకులు. ఆయన కుటుంబానికి చెందిన షర్మిలపై కూడా అనేకమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది.

జగన్ సీఎం కావడంతో టీడీపీ నాయకుల దూకుడుకు కళ్లెం వేసినట్లూ అయింది. అయితే తాజాగా జగన్ కూతుర్లపై కూడా టీడీపీ నాయకులు విషం కక్కడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్‌కు ఇద్దరు కూతుర్లే అనే విషయం అందరికి తెలిసిన సంగతే. వారిద్దరూ కూడా ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉంటున్నారు. అయితే ఇటీవల ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ వ్యాపించడంతో పలు దేశాలు హెల్త్ ఎమెర్జన్సీని ప్రకటించాయి. దీంతో లండన్‌లో ఉంటున్న జగన్ ఇద్దరు కూతుర్లు కూడా ఇండియాకు తిరిగి వచ్చేశారు. జగన్ కూతుర్లు ఇలా లండన్ నుంచి క్షేమంగా రావడాన్ని కూడా టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిపై కూడా పలు విమర్శల దాడికి దిగుతున్నారు. లండన్‌లో మీ కూతుర్లకు పారాసిటమాల్ వేస్తే సరిపోయేది కాదా. పాపం ఇది తెలియక వారు ఇక్కడకు వచ్చారా అంటూ ఎద్దెవా చేశారు టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న.

లండన్‌లో పారాసిటమాల్ దొరక్క వారు ఇక్కడికి వాచ్చారా ..? అంటూ వెటకారంగా మాట్లాడారు బుద్ధా. ఇలా జగన్ కూతుర్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడిన బుద్థా వెంకన్ను టార్గెట్ చేసుకున్నారు వైసీపీ అభిమానులు. మాచర్లలో కన్నులోట్టబోయి ,, బ్రతుకు జీవుడా అంటూ వచ్చి విజయవాడలో పడ్డావ్. మళ్లీ మా నాయకుడు జోలికి కాని , మాపార్టీ జోలికి కాని వస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ కూతుర్లు ఎప్పుడో నెల క్రితమే వీసాను ఆప్లై చేశారని కావాలంటే చెక్ చేసుకొవచ్చని టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నారు వైసీపీ కార్యకర్తలు. మరి దీనిపై బుద్ధా వెంకన్న ఎలా స్పందిస్తారో చూడాలి.