టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది సమంత. నాగ చైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచియం అయింది ఈ భామ. మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీని మొత్తం తన మాయలో పడేసింది. ఆమె నటించిన మొదటి సినిమానే హిట్ కావడంతో వరుస ఆఫర్లు సమంత తలుపుతట్టాయి. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్థార్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి మెప్పించింది. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందామె

ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని ఇంటికోడలుగా మారింది. అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్2ను పెంచుకుంది. పెళ్లి తరువాత సమంత నటించిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో అమ్మడు రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. వరుస హిట్లు రావడంతో రెమ్యూనిరేషన్ కూడా పెంచేసింది సమంత. దీంతో నిర్మాతలు ఆమెను సంప్రదించాలంటే తెగ భయపడిపోతున్నారు.

తాజాగా ఓ మీడియా ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ….నాకు ఓ హీరోతో డేట్‌కు వెళ్లాలని ఉందని చెప్పి అందరిని షాక్‌కు గురిచేసింది. అదేంటి సమంతకు నాగచైతన్యతో పెళ్లి అయింది కాదా ,మళ్లీ మరో హీరోతో డేట్‌కు వెళ్లాలనుందని చెప్పడం ఏంటని అనుకున్నారంతా. అక్కినేని ఇంటి కోడలు అయి ఉండి ఇలా మాట్లాడటం ఏంటని చాలామంది సమంతను ట్రోల్ చేశారు. అయితే సమంత డేట్‌కు వెళ్లాలనుందని చెప్పింది తన భర్త నాగచైతన్యతో అని తెలిసిన తరువాత సమంతను తిట్టినవారంతా బాధపడ్డారట.

నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తనతో డేటింగ్‌కు వెళ్లలేదని ఈ ఇంటర్య్వూలో తెలిపింది సమంత. అటు నాగచైతన్య , ఇటు నేను ఇద్దరం కూడా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల పెద్దగా ఎంజయ్ చేయలేకపోయమని తెలిపింది. దీంతో కొన్ని రోజులు సినిమాలకు విరామం ఇచ్చి నాగచైతన్యతో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని తన మనస్సులోని కోరికను బయటపెట్టింది సమంత. అయితే సమంత కోరికను నాగచైతన్య తీరుస్తాడో లేదో చూడాలి.