రేవంత్ రెడ్డి … కరుడుగట్టిన టీడీపీ నాయకుడు ఇది ఒకప్పుడు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ కూడా టీడీపీపై అభిమానం ఎప్పటికీ అలానే ఉంటుందని అంటుంటారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైయ్యారు రేవంత్ రెడ్డి. చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్సీను కొనుగొలు చేయలని చూశారు. కాని కేసీఆర్ ఎత్తులు ముందు చంద్రబాబు ప్లాన్లు ఏమాత్రం పని చేయలేదు. 5 కోట్ల డబ్బుతో అడ్డంగా దొరికిపోయారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం కావడంతో, రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి చంద్రబాబే పంపించారని ఆరోపణలు ఉన్నాయి.

రేవంత్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి కేసీఆర్, ఆయన కుటంబీకులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కేటీఆర్ ఫాం హోస్ గురించి ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. కేటీఆర్ ప్రభుత్వ కాలువ స్థలంలో ఫాం హోస్‌ను నిర్మించుకున్నారని రేవంత్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫాం హోస్‌ను అందరికి చూపించాలనే ఉద్దేశంతో డ్రోన్ కెమెరాలతో వీడియాను చిత్రీకరించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ… నువ్వు నిజాయితీ పరుడివైతే జగన్‌లా నీ నిజాయితీని నిరుపించుకొమ్మని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అప్పటి టీడీపీ పార్టీ కోరింది. దీనికి అప్పుడు సీఎం రాజశేఖరరెడ్డి కూడా అంగీకరించారు. తన కొడుకు అయినప్పటికి కూడా పరిటాల హత్య కేసులో జగన్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించారు వైఎస్‌ఆర్. పరిటాల రవి హత్య కేసుకు జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది సీబీఐ. దీంతో జగన్ నిజయితీ బయటికి వచ్చింది. కేటీఆర్ నువ్వు కూడా ఎటువంటి తప్పు చేయలేదని నిరుపించుకొమ్మని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. నీపై కూడా సీబీఐ దర్యాప్తు వేయించుకుని క్లీన్‌గా బయటికి రమ్మని కేటీఆర్‌ను ఉద్దేశించారు మాట్లాడారు రేవంత్ రెడ్డి. వీరిద్దరి సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈ ఘటనలోకి ఏపీ సీఎం జగన్ లాగడంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి నోట నుంచి జగన్ నిజయితీ బయటికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్‌కు జగన్ నిజయితీ గురించి తెలిసొచ్చిందని వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నారు.