ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఒక కేసు బత్తలపల్లి ఘర్షణకు సంబంధించి మరో కేసు అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై పోలీస్ కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి, రామగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఎన్నికల కోడ్​ అమలులో ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసు పోలీసులు నమోదు చేశారు.