• MSME (సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమ లను ఆదుకోడానికి జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
    (MSME-Micro, Small & Medium Enterprises )
  • వీరికి విరివిగా రుణాలు ఇచ్చి ఆదుకునేందకు ప్రభత్వం ముందుకొచ్చింది.
  • రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేలా కొత్త పథకాన్ని ప్రారంభించారు. దీనిపై వడ్డీ 6 నుంచి 8 శాతం ఉంటుంది. కాలపరిమితి 3 సంవత్సరాలు.
  • దీని కోసం రూ.200 కోట్లతో క్యాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారు.
  • ఈ ఫండ్‌కి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు సమకూరుస్తుంది. మిగతామొత్తం సిడ్బి (స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌) లేదా ఇతర బ్యాంకులు సమకూరుస్తాయి.
  • ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి సెప్టెంబర్‌ 30 చివరి తేదీ.
  • చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి ఇవ్వాల్సిన MSME బకాయిలు రూ.828 కోట్లను ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయించింది.
  • జగన్‌సీఎం అయిన తరువాత ఉన్న బకాయిలు రూ.77 కోట్లతో సహా మొత్తం రూ.905 కోట్లను ఇప్పటికే విడుదల చేశారు.
  • విద్యుత్‌ డిమాండ్‌ భారం నుంచి 3 నెలల ఉపశమనం కలిగించేదుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
  • దీని వల్ల 79,708 MSME లకు విద్యుత్‌ డిమాండ్‌ భారం నెలకు రూ.62.70 కోట్లు చొప్పున మూడు నెలల కాలంలో రూ.188 కోట్ల వరకు లబ్ధి చేకూరనుంది.
  • జీఎస్టీ మినహాయింపుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు వైఎస్‌ జగన్‌.