• వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అనే ఈ మాటకు ముందు..
  నల్ల కాల్వ దగ్గర ఇచ్చిన మాట చెవుల్లో మారుమోగుతోంది, కళ్లల్లో మెదలాడుతోంది..!!
 • వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అనే ఈ మాటకు ముందు..
 • ఇచ్చిన మాట కోనం కోట్ల కష్టాలు ఎదుర్కొన్న ధీరుడు కళ్ల ముందు కనిపిస్తాడు..!!
 • వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అనే ఈ మాటకు ముందు..
 • ఢిల్లీని ఢీకొట్టిన వీరుడు కనిపిస్తాడు..!!
 • వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అనే ఈ మాటకు ముందు..
 • ఓదార్పు యాత్రతో కోట్ల గుండెలను పలకరించిన మానవతావాది కనిపిస్తాడు…!!!
 • వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అనే ఈ మాటకు ముందు..
 • కాంగ్రెస్‌, చంద్రబాబు కుట్రలను కూకటివేళ్లతో కూల్చిన రాజకీయ రణధీరుడు కనిపిస్తాడు..!!
 • రావాలి జగన్..కావాలి జగన్ అనే నినాదం నింగిన తాకి భూమిపై నడియాడిన రోజు..!!
 • కోట్ల గుండెల ఆశలు అంతులేని ఆనందంతో గంతులేసిన రోజు…ఈ ప్రమాణం చేసిన రోజు..!!
 • బై బై బాబు..బై బై పప్పు అంటూ అవినీతిపాలకుల ఆనవాళ్లు కూడా లేకుండా చేసిన రోజు…!!
 • మే 30, 2019 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త శకానికి నాంది..!

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అంటూ తన ప్రమాణంతో కోట్ల మంది కొత్త ఆశలకు వైఎస్‌ జగన్‌ ఊపిరి పోసిన రోజు..!!. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసి ఏడాది పూర్తైంది. అప్పుడే ఏడాది పూర్తైందా అనిపిస్తోంది మనసుకి. కాలం చాలా వేగంగా నడుస్తోంది. నాకు బాగా గుర్తు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి లాంటి సీఎంను భారతదేశం చూసి ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికంగా దివాళ తీసిన పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ..ఆయన చిరు నవ్వు ఎక్కడా చెరగనివ్వలేదు. తండ్రి వైఎస్‌ఆర్‌ చనిపోయిన తరువాత తనను చుట్టుముట్టిన రాజకీయ రాబందులను ఎంత ధృడ చిత్తంతో ఎదుర్కొన్నాడో..అదే ధృడ సంకల్పంతో పాలనా పగ్గాలను చేతపట్టి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని చూస్తుంటే ఓ రాజకీయ శాస్త్రం చదివినట్లు అనిపిస్తది. ఎందుకంటే..ప్రత్యర్ధుల కుట్రలను ఎలా ఎదుర్కోవాలి..?!. ప్రత్యర్ధులు రాజకీయంగా దాడి చేసినప్పుడు ఎంత కూల్‌గా ఉండాలి..?!!. ప్రజల నమ్మకాన్ని ఎలా పొందాలి?!!. ప్రజల కష్టాలు ఎలా తెలుసుకోవాలి..?!!. ప్రజల మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి?!!. ప్రజలకు భరోసా ఇవ్వడం..?!!. నిత్యం ప్రజలతో ఎలా మమేకం కావాలి?!!. ప్రత్యర్దుల కుట్రలను ఎలా చిత్తు చేయాలి?!!. రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఎలా వేయాలి?!!. ప్రజల అండతోనే ప్రతిపక్షాలను ఎలా మట్టి కరిపించాలి?!!. మాట ఇస్తే ఆ మాట మీద ఎలా నిలబడాలి ?!!. ఇవన్నీ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిలో కనిపిస్తాయి. అందుకే …వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని రాజనీతి గ్రంధం అన్నది. ఎవరైనా రాజనీతిశాస్త్ర విద్యార్దులు సమకాలిన రాజకీయాలపై పరిశోథన చేయాలనుకుంటే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని మించిన గ్రంధం మరొకటి ఉండదు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అనేరాజనీతి గ్రంధంలో అధికారం కోల్పోవడం, అధికారం కోసం ప్రజలను నమ్ముకోవడం, ఆ ప్రజల అండతో అధికారం చేపట్టడం ఇవన్నీ చూడొచ్చు. రాజకీయ పార్టీని పెట్టడం..నడపడం, ప్రజల మెప్పు పొందడం, చంద్రబాబు లాంటి నేతను ఎదుర్కోవడం, అంతకంటే చంద్రబాబు మీడియాను ఢీ కొట్టి నిలబడటం మాములు విషయం కాదు. అందుకే..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిలాంటి నేతను ఇప్పటి వరకు స్వాతంత్ర భారతం చూసి ఉండదు.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చూడటానికి చాలా కూల్‌గా ఉంటారు. ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. చాలా సిగ్గు పడుతున్నట్లు ఉంటారు. ఒక చేతిని మరో చేతిలో పెట్టుకుని చిన్నగా నడుస్తూ..ఎదురొచ్చిన వారిని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తుంటారు. కానీ..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మనసులో ఒకటి అనుకున్నారంటే దానిని సాధించే వరకు విశ్రమించరు.తన టీమ్‌ను విశ్రమింపనివ్వరు. నాన్న వైఎస్‌ఆర్‌లోని లక్షణాలు వైఎస్‌ జగన్‌ పునికిపుచ్చుకున్నారు. ప్రజాసేవే పరమాధిగా వైఎస్‌ఆర్‌ సీపీని స్థాపించి పాదయాత్రతో అధికారంలోకి తెచ్చారు. చాలా మంది నన్ను వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలనలో పథకాలు మీద మంచి ప్యాకేజీ రాయవచ్చు కదా అని అడిగారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలనలో పథకాలు పల్లెపల్లెలో గడపగడప తొక్కాయి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలనపై సోషల్ మీడియా విస్తృత ప్రచారం కల్పిస్తుంది. మే 23 నుంచే వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పథకాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పాటలు, మాటలు, పదాల రూపంలో వైఎస్‌ఆర్‌ సీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై 60శాతానికి పైగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. మనం ఇక్కడ చర్చించాల్సింది ఒక్కటుంది. పాలనలో ఏమాత్రం అనుభవం లేకుండా, చంద్రబాబులాంటి కుయుక్తులు పన్నే నేతను, చంద్రబాబు మీడియాను ఎదుర్కొంటూ ఏడాదిలోనే వైఎస్‌ జగన్ రాష్ట్ర, దేశ నేతల ప్రశంసలే కాకుండా ప్రపంచాధినేతల తనను అనుసరించేలా ఎలా చేయగలిగారు?!!. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిలో ఉన్న శక్తి ఏంటీ?. దీనిపై ప్రధానంగా చర్చించాలి.

కుర్రాడు అన్నారు. అనుభవం లేదన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఎలా పాలిస్తాడో ఏమో అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును పక్కన పెట్టి ఏపీ ప్రజలు తప్పు చేశారని కామెంట్ చేశారు.ఆర్ధికంగా అంతంతమాత్రంగానే ఉన్న ఏపీని వైఎస్‌ జగన్‌ ఎలా నెట్టుకొస్తాడో అంటూ విశ్లేషణలు చేశారు. కాని..ఇప్పుడు ఆ కుర్రాడే ఏపీ భవిష్యత్తు దిక్సూచి అయ్యాడు. రూ.100 కోట్ల ఖజనాను వేల కోట్ల సంక్షేమ , అభివృద్ధి పథకాల కోటగా మలిచారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిది అద్భుతమైన ఆలోచన శక్తి, అంతే అద్భుతమైన మేదో శక్తి. ఓదార్పు, పాదయాత్రలతో ప్రజానాడిని పట్టారు. ప్రజల మనసుల్లో ఏముందో, వారు ఏం కోరుకుంటున్నారో వైఎస్‌ జగన్‌కు బాగా తెలుసు. ఈ రోజున మీడియా, కోర్టులు వైఎస్ జగన్ పక్షాన ఉండక పోవచ్చు. కాని, కోట్ల మంది ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితోనే ఉన్నారు.తమ నాయకుడు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న నిర్ణయాలు చూసి తమ బతుకులకు భరోసా దొరికిందని మురిసిపోతున్నారు. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రధేశ్‌కు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఓ దివిటి అని చెప్పాలి. ఆ దివిటి వెలుగులు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అమరావతి నుంచి అనంతపురం వరకు విరజిల్లుతున్నాయి.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి గాందేయవాది. మహాత్ముని సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తారు. నాకు తెలిసి స్వాతంత్ర్యం తరువాత ఏ కాంగ్రెస్‌ నాయకుడు కూడా గాంధేయ సూత్రాలను పాటించలేదు. కాని..వైఎస్‌ జగన్‌ మాత్రం మహాత్ముని బాటలో నడుస్తున్నారు. గ్రామ సచివాలయాలతో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నారు. గాంధీ కలలు కన్నా గ్రామస్వరాజ్యం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రూపంలో నిజం కాబోతుంది. ఆ గ్రామానికి ఏం కావాలో ఆ గ్రామంలోనే ఉండాలి, దొరకాలి ఇదే సూత్రాన్ని వైఎస్‌ జగన్ అమలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లతో గ్రామీణ విప్లవం తీసుకురాబొతున్నారు వైఎస్‌ జగన్‌. ఇంటి దగ్గరకే పింఛన్‌ అనే నినాదానికి తోడు ఇంటి దగ్గరకే వైద్యం అనే నినాదం ఏపీలో నిజం కాబోతుంది. ఏడాది కాలంలోనే రైతుల్లో నేనున్నాననే భరోసాను వైఎస్‌ జగన్ కల్పించారు. మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి డబ్బులు నేను ఇస్తా అనే పాలకుడిని మనం ఎక్కడైనా స్వాతంత్ర భారత చరిత్రలో చూశామా?. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రూపంలో చూస్తున్నాం..! పిల్లలకు మామయ్యగా నేనిచ్చే ఆస్తి చదువే అని చెప్పి వారి భవిష్యత్తు బాటలు వేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. నెలనెల ఇంటి దగ్గరే పింఛన్‌ తీసుకుంటున్న అవ్వలు, వికలాంగుల మాటుల వింటున్నప్పుడు, వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నప్పుడు ఇది కదా ప్రజారంజక పాలన అని అనిపిస్తోంది.

వాలంటీర్ వ్యవస్థ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమైంది. వైఎస్‌ జగన్‌ ఆలోచన నుంచి పుట్టిన వాలంటీర్‌ వ్యవస్థ భవిష్యత్తులో ప్రపంచ సామాజిక రూపురేఖలనే మార్చబోతుంది. పాలనను ప్రపంచ ప్రజలకు మరింత చేరువ చేయబోతుంది. ఈ క్రెడిట్ కచ్చితంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిదే. ప్రజలకు పాలనను ఎంత దగ్గరగా చేశాము అనే దాని మీదనే పాలకుల ప్రతిభను అంచనా వేయవచ్చు. వాలంటీర్‌, గ్రామ సచివాలయం, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, గోరు ముద్ద, రైతు భరోసా, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా వైఎస్‌ జగన్‌ పాలనా ప్రతిభకు నిదర్శనం. ఏడాది పాలనపై సమీక్ష జరుగుతోంది. రమ్య అనే అమ్మాయి లేచి తన అమ్మ గురించి చెప్పుకుంది. అమ్మ ఎప్పటి వరకు బతుకుతుందో తెలియదని చెప్పింది. కాని..మామయ్య అమ్మ కావాలని కన్నీళ్లతో చెప్పింది. వైఎస్‌ జగన్‌ మనసు కరిగిపోయింది. అక్కడిక్కడే ఆదేశాలు ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ తీసుకుని రమ్య ఇంటికి వెళ్లి అమ్మను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పాలకుడు ఎంత సమర్ధుడు, ఎంత మంచి మనసు ఉన్నవాడు, ఎంత గొప్ప మానవతావాది అనేది ఇక్కడే అర్ధమైపోతుంది. అందుకే..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సమకాలిన రాజకీయాల్లో ఓ ఆరుదైన పాలకుడు.

పాలనా రధం సాఫీగా సాగిపోతున్నప్పుడు పాలకుల ప్రతిభ వెలుగులోకి రాదు. కష్టకాలంలో వారు చెప్పే మాటలు, తీసుకునే నిర్ణయాలు ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేస్తాయి. కరోనా కష్టకాలంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడిందే దేశం, ప్రపంచం మాట్లాడింది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాటలను మొదట హేళన చేసిన వారు తరువాత సిగ్గు పడాల్సిన పరిస్థితి. కరోనా కష్టం వైఎస్‌ జగన్‌ ఎంత మంది పాలకుడో దేశానికి పరిచయం చేసింది. ఏపీ గుండా మండే ఎండల్లో, చంకన పిల్లలను వేసుకుని , కాళ్లకు చెప్పుల్లేకుండా, కాలే కడుపుతో, తాగడానికి నీళ్లు లేక స్వస్థలాలకు వెళ్తున్న వారికి అన్నగా సీఎం వైఎస్‌ జగన్‌ తోడుగా నిలబడ్డారు. మంచి భోజనం, వసతి ఇవ్వడమే కాదు కాళ్లకు చెప్పులు కూడా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రత్యేక బస్సుల్లో వదిలేలా ఆదేశాలిచ్చారు. ఖర్చులకు వలస కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున ఇచ్చి మానవత్వం అంటే ఇదని చాటి చెప్పారు. ఏపీ ప్రజల మన్ననలే కాదు ఈశాన్య, యూపీ, బిహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ప్రజల, కార్మికుల మన్ననలు కూడా పొందిన పాలకుడు వైఎస్‌ జగన్‌. అంతేకాదు..కరోనా జోన్ల వ్యవస్థను దేశానికి పరిచయం చేసి, దేశ ఆర్ధిక వ్యవస్థ కూలిపోకుండా కేంద్రానికి సలహాలు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్‌. మంచి మనసుంటే దేవుడే దారి చూపుతాడు అంటారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఇంత మంచి మనసున్న నేత కాబట్టే ఏడాది పాలనలోనే తన నిర్ఱయాలు, పథకాలతో ఎంతో మంది నేతలకు ఆదర్శమయ్యారు.

అందుకే మొవట్లోనే చెప్పా వైఎస్‌ జగన్‌ ఓ రాజనీతి, పాలనా గ్రంధం. ఈ మాట నేను ఊరక అనడం లేదు. ఆయన నిర్ణయాలు ప్రస్తుత సమాజంలో మార్పులు తెస్తూనే..భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. దెబ్బతిన్నవాడే, కష్టపడి పాలనా పగ్గాలు చేపట్టినవాడే ప్రజల మనసెరిగి పాలన చేయగలరు. వైఎస్‌ జగన్‌ పుస్తకాలు ఎంత ఇష్టంగా చదువుతారో, సమాజాన్ని, సమాజంలోని తారతమ్యాలను అంతే చదివారు. అందుకే…ఆయన పథకాలు భవిష్యత్తు సమాజ నిర్మాణంలో భాగం కాబోతున్నాయి. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వం , మనస్తత్వం చాలా ధృడ మైనవి ఎంతంటే కోట్ల కుట్రలు ఒక్కటై ఎదురొచ్చి నిలబడినా ఎదిరించి పోరాడి , నిలబడే దమ్ము వైఎస్‌ జగన్‌కు ఉంది. ప్రజాస్వామ్య విలువలను, సూత్రాలను అణువణువునా వంటబట్టించుకున్న నాయకుడు, పాలకుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. ప్రత్యర్ధులు ఎన్ని మాటలు అన్నా చిరునవ్వుతో ఆ మాటలను చిత్తు చేస్తూ పాలన రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఏడాదిలోనే తానేంటో నిరూపించుకున్నారు. మరో నాలుగేళ్లు ఈ నాలుగేళ్లలో తానేంటో కాదు తన ఆలోచన, నిర్ణయాల శక్తి ఏంటో చూపించడానికి ప్రణాళికలు వైఎస్‌ జగన్‌ తన మనసులో తయారు చేసుకునే ఉంటారు. అందుకే..వైఎస్‌ జగన్‌ వారియర్‌ పొలిటికల్ వారియర్‌.