టీడీపీ అధినేతకు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ నాయకులు వరుస పెట్టి అధికార పార్టీలో వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థతి నెలకొంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే టీడీపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ నాయకులు ఇప్పటికే వైసీపీ కండువా కప్పకున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, పులివెందుల నుంచి సతీష్ రెడ్డిలు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, కదిరి బాబురావు, పంచకర్ల రమేశ్ బాబులు కూడా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కర్నూల్ జిల్లా నుంచి కేఈ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరనున్నట్లూ తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి శింగనమల మాజీ ఎమ్మెల్యే శమంతకమణి కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబుకు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోన్ రావు కూడా పార్టీ మారలనే ఆలోచన చేస్తున్నారట. దీనిలో భాగంగానే ఆయన గుడివాడ ఎమ్మెల్యే , మంత్రి కొడాలి నానితో భేటీ కావడం సంచలనంగా మారింది. గద్దె రామ్మోన్ రావు మొదటి నుంచి టీడీపీ పార్టీకి సానుభూతిపరుడిగానే కొనసాగుతున్నారు. చంద్రబాబు నమ్మకస్తుల్లో గద్దె కూడా ఒకరు. పైగా ఇద్దరు కూడా ఒకే వర్గానికి చెందిని వారు కావడంతో చంద్రబాబు వద్ద కాస్తా చనువుతోనే కొనసాగేవారు గద్దె. మరి అలాంటి గద్దె రామ్మోహన్ రావు కూడా పార్టీ మారలని చూడటం విశేషం. టీడీపీ పార్టీ తరుపున ఆయన అనేసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పేదల పెన్నిదిగా ఆయనకు నియోజిక వర్గం మంచి పేరు ఉంది. అందుకే గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరి విజయం సాధించారాయన. ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే గద్దెకు ఖచ్చింతగా మంత్రి పదవి కూడా వచ్చి ఉండేది. కాని ఫలితాలు గద్దెకు షాకిచ్చాయి. తాను గెలిచినప్పటికీ కూడా పార్టీ ఓడిపోవడంతో కంగుతిన్నారాయన.

గత కొద్దిరోజులుగా పార్టీలో సైలెంట్ అయ్యారు గద్దె. పలు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరుకావడం లేదు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని గద్దె కూడా భావిస్తున్నాట్లుంది. అందుకే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారట. ఇప్పటికే టీడీపీ నాయకులు వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలోనే గద్దె రామ్మెన్ రావు , మంత్రి కొడాలి నానితో భేటీ కావడం ప్రాధన్యతను సంతరించుకుంది. ఆయన వైసీపీలో చేరడానికే నానితో భేటీ అయ్యారని ప్రాధమిక సమాచారం. అయితే జగన్‌కు మద్దతు ఇవ్వాలి అంటే కొన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారట. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని , తన నియోజిక వర్గానికి కొన్ని ప్రత్యేక నిధులను కేటాయిస్తే తాను సీఎం జగన్‌కు మద్దతిస్తానని కొడాలి నానితో గద్దె తెలిపినట్లూ సమాచారం అందుతోంది. గద్దె డిమాండ్లుకు కొడాలి నాని కూడా ఓకే చెప్పారట. అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు , మూడు రోజుల్లో గద్దెను జగన్ వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట కొడాలి నాని. దీని బట్టి చూస్తే టీడీపీ నుంచి మరో వికెట్ పడినట్లే కనిపిస్తోంది