• బాబుకి ఒక ప్రత్యేక రూల్ ఏమైనా ఉందా ????
  • “అదేదో కోసినా గుణం మారదని” అంటారు పెద్దలు….. ఏదేమైనా పెద్దల సామెతలు అద్భుతం సుమా…. ఏ కాలానికైనా అచ్చుగుద్దినట్టు సరిపోతాయ్….
  • ఇంటికో ఉద్యోగమిస్తానన్నాడు… ఇచ్చాడా ?
  • పక్క రాష్ట్రం లో ఓట్ల బేరాలాడి దొరికిపోయి ఇక్కడకు పారిపోయి వచ్చాడు…. ఇక్కడైనా బుద్దిగా ఉన్నాడా ? ఇక్కడ 23 మందిని కొన్నాడు !
  • జనం తన మొహాన …… మొన్నటి ఎన్నికల్లో సరిగ్గా 23 సీట్లే ఇచ్చి ఇంటికి పంపితే … కనీసం….. పడ్డాడా? అబ్బే అవి ఇంటా ఒంటా ఎక్కడేడిసాయ్….
  • ఇప్పుడు విశాఖ బాదితులవద్దకు వెళ్ళాలని అనుమతికోరినట్టే కోరి…. తన పార్టీనుండి వెళ్ళిపోవడానికి బ్యాగులు సర్దుకున్నవారిని బ్రతిమలాడి బుజ్జగించి… తనదారిన మళ్ళీ పక్కరాష్ట్రానికి పారిపోయాడు.
  • ప్చ్…. జేబులు కొట్టే గుణం ఎన్ని జన్మలెత్తినా మారదుసుమీ !

చిన్న కథ – మన చెంబా కోసం

హలో…సుబ్బారావ్…ఎలా ఉన్నావ్ ?

బావున్నాను సర్ ఏదో మీదయవలన ఇలా….

సరేగానీ…. ఆమద్య నాదగ్గరవాడుకున్న 5 లక్షలు కాస్త తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమో….

అదేంటిసర్….5 లక్షలంటున్నారు ? నేను మీకు ఇవ్వాల్సింది 3 లక్షలేకదండీ ?

చూసావా సుబ్బారావ్…. నువ్వెలా దారికొచ్చావో…. నీ నోటితోనే నాకు నువ్వు ఎంత బాకీ పడ్డావన్నది ఎలా చెప్పించానో చూసావా ? నేను 5 లక్షలు అని ఒక చిన్న అబద్దం చెప్పి… అసలు నిజాన్ని నీనుండి ఎలా రాబట్టానో చూసావా ?

ఆ… ఏమి అబద్దమో… ఏమి నిజమోలెండి… మీరలా 5 లక్షలు అనేసరికి నేను జడుసుకు చచ్చాననుకోండి… ఔనూ మీబోటివారు అలా తమాసాకైనా అబద్దాలు ఆడవచ్చటండీ ?

ఇదిగో…. చూడూ…. ఒక నిజాన్ని రాబట్టడం లో…. ఒక చిన్న అబద్దం ఆడడం లో తప్పులేదోయ్… ఉదాహరణకు ఎన్నికల కమిషనర్ని తొలగిస్తూ కొత్తగా ఎన్నికల కమిషనర్ని నియమించుకున్న ప్రభుత్వానికి…. అబ్బే ప్రభుత్వానికి ఆ హక్కు లేదని పెద్దలిప్పుడు అంటున్నారు చూసావా ?…. అసలు నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా రాబట్టిందో చూసావా ?… ఎన్నికల కమిషనర్ని నియమించుకునే హక్కు ఇప్పటి ప్రభుత్వానికి లేనప్పుడు… ఇదే ఎన్నికల కమిషనర్ని గత ప్రభుత్వం నియమించిందికదా ? అదెలా చెల్లుద్ది ? అని ఇప్పుడు చర్చ జరుగుతుంది చూసావా ??? అదీ లెక్కన్నమాట.

అంటే…. నిమ్మగడ్డ ఇలా నలిగిపోవాల్సిందేనంటారా ?

అబ్బే… ఇక్కడ ప్రశ్న అదికాదోయ్ సుబ్బారావ్… బాబుకి ఒక రూలు… జగన్ కి ఒక రూలా ? అనే చర్చ జనం లో మొదలైంది చూసావూ…. అది కావాలోయ్ నేటి సమాజానికి… ఏ చర్చ ఐనా పెద్దమనుషులనబడే నలుగురికో… ఐదుగురికో పరిమితమైతే ఏముందోయ్ సుబ్బారావ్… ప్రజల్లో చర్చ జరిగితేనే నిజమైన తీర్పు వస్తుందోయ్.

అన్నట్టు నా 5 లక్షలెప్పుడిస్తావ్ ?

అదిగో… మళ్ళీ 5 లక్షలంటున్నారుమీరు… మీకివ్వాల్సింది 3 లక్షలేనండీబాబూ….

సర్లేవయ్యా… అసలు నిజాన్ని మరోసారి నీ నోటితోనే వినాలనే అలా అన్నాను… తొందరగా ఇచ్చెయ్….. బాకీలు అలా ఎక్కువకాలం ఉంచుకోరాదుసుమా…. ఎప్పటికప్పుడు తీర్చేసుకుంటేనే మంచిది !

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ని నియమించుకునే హక్కు లేనప్పుడు…12-12-2015 లో బాబు ముఖ్యమంత్రిగా ఉంటూ తాము నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమించుకుంటున్నామని చేసిన సిఫార్సు చెల్లుతుందా ???

బాబుకి ఒక ప్రత్యేక రూల్ ఏమైనా ఉందా ????

మొత్తానికి కోర్టులకీ…. ప్రభుత్వాలకి మద్య నిమ్మకాయ మాసెడ్డ నలిగిపోతుందిసుమా !