ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుదేలయి పోయింది. 2014 నుంచి 2019 మే వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏపీ ఆర్ధిక వ్యవస్థను నిర్మించకపోగా దోచుకున్నారు. ఓ పాలకుడే ఆర్ధిక వ్యవస్థను దోచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఖజానాను దివాళ తీయించి చంద్రబాబు దిగిపోయారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాడి కింద పడేసిన ఆర్థిక వ్యవస్థను భుజాలకెత్తుకుని మోస్తున్నారు. అవినీతిని అరికట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. కరోనా దెబ్బకు ఉద్యోగులకే రెండు దఫాలుగా జీతాలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య సంక్షేమ పథకాలు అమలు సాధ్యమా అని చాలా మంది వేస్తున్న ప్రశ్న. నిజమే..వైఎస్‌ జగన్‌ పరభుత్వానికి ఇది క్లిష్టమైన పరిస్థితే . ఓ పక్క కరోనాను అడ్డుకోవాలి, మరోపక్క ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి, సంక్షేమ పథకాలు ఆగకుండా చూస్కోవాలి. ఇన్ని సవాళ్లు ఏపీ ప్రభుత్వం ముందు ఉన్నాయి. కాని..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మరీ దిగజారే పరిస్థితే వస్తే..దేవాలయాల డబ్బులను వాడుకోవచ్చు. ఆర్ధిక వ్యవస్థ కుదుట పడ్డ తరువాత దేవాలయాల డబ్బులు ఇచ్చేయవచ్చు. దేవుడు కూడా ఉన్నది ప్రజల కోసమే కదా..?. కరోనా దెబ్బతో ప్రభుత్వానికి టాక్స్‌లు రూపంలో రావాల్సిన టాక్స్‌లు రాకుండా ఆగిపోయి ఉంటాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తే మంచిది. లేనిపక్షంలో నిధులను సొంతంగా రాబట్టుకోవాల్సిందే. బాండ్‌లు, భూములు తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఏం మిగిల్చి ఉంటాడని నేను అనుకోను. కాబట్టి…ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకోవడంలో తప్పు లేదు. ఆసియా, ఇంటర్నేషనల్ బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకోవచ్చు. కేంద్రానికి అదనపు నిధులు కోసం విజ్ఞప్తి చేయవచ్చు.

ఏపీకి ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాటలు, చేతలే శ్రీరామ రక్ష. సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రజలు వినాలి. అధికారులు పని చేయాలి. ఏపీ ఆర్ధిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఆయన మదిలో ఇప్పటికే ఆ ప్రణాళికలు ఉండి ఉంటాయి. వైఎస్ జగన్‌ గీసిన లక్ష్మణ రేఖను దాటొద్దు, ఆయనకు ప్రజలకు సహకరించాలి. కొన్ని నెలల్లోనే ఏపీ ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది.

ప్రకృతి తనను తాను పునర్‌నిర్మించుకుంటుందని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. కరోనా వైరస్‌ ధాటికి జనాలు బయటకు రావడం మానేశారు. దీంతో ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రపంచ దేశాల్లో కాలుష్యం తగ్గింది. చాలా కాలం తరువాత పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా విహరించడం చూశాను. ఆకాశంలో ఓజోన పొర తనను పునర్‌ నిర్మించుకుంటుంది. ఇది మానవాళికి మేలు చేసేదే. ఓ పక్క కోరానాప్రజలను క్రమశిక్షణలో పెట్టి శుభ్రత,పరిశుభ్రత నేర్పుతుంటే, మరోపక్క ప్రకృతి తాను కోల్పోయిన దానిని సొంతం చేసుకుంటుంది. అందుకే అంటారు పెద్దలు ఏం జరిగినా మన మంచికే అని. ప్రతిదాని నుంచి గుణఫాఠం నేర్చుకోవాలని. కరోనాను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది కదూ..!!.