ఈ తరం వారికి, భవిష్యత్తు తరాల వారికి నాదో సలహా…” మీరు నాయకులు కావాలి అనుకుంటే, ప్రజాసేవ చేయాలి అనుకుంటే, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొని జీవితంలో గెలవాలి అనుకుంటే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఫాలో అవ్వండి”. యువతి, యువకులకు, భవిష్యత్తు తరాలకు నేనిచ్చే అమూల్యమైన సలహా ఇది. నాన్న లక్ష్యాలను బతికించాలి..!. నాన్న లక్ష్యాలను సాధించాలి..! .పేదరికాన్ని పారదోలి సమసజాన్ని నిర్మించాలి ..! .ఇవన్నీ చేయాలంటే సీఎం కావాలి..!. సీఎం కావాలంటే కానివ్వరూ.. కష్టపడాలి…! . ఎం సీట్లో కూర్చుని మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలి..!. ప్రజల మలిచిన, మెచ్చిన సీఎంగా ఉండాలి..!. మనసులో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆలోచనలు. తన ఆలోచనల నుంచి పుట్టిన ప్రతి ప్రశ్నకు తానే సమాధానం చెప్పుకుంటూ నల్లకాలువ నుంచి ముందకు కదిలారు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. పదేళ్ల తరువాత ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యారు. మే30, 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ..ఆరు నెలల్లోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానన్నారు. అనడమే కాదు ఆరు నెలల్లోనే దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘దిశ’లాంటి చట్టం తీసుకొచ్చి దేశం మొత్తం తన గురించి చర్చించుకునేలా చేశారు. ”అమ్మ ఒడితో నోబెల్ బహుమతి గ్రహీతల చేత శభాష్‌ అనిపించుకున్నారు.

“మీరు ఏం చదువకుంటారో చదువుకోండి ఎంతైనా ఖర్చు పెడతాను ” అన్న దమ్మున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే చదువులకు 10వేల కోట్లకుపైగా కేటాయించారు. రివర్స్‌ టెండరింగ్‌తో వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారు. పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులు చుక్క నీరు వృధా కాకుండా ప్రణాళికలు రచించారు. ‘రైతు భరోసా’తో అన్నదాతకు వెన్నెముక అయ్యారు. ఇలా తన పథకాలతో ఆంధ్రా లోగిళ్లలో సంక్షేమాన్ని పండిస్తూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు ఆర్ధికంగా దివాళా తీయించిన రాష్ట్రాన్ని 10 నెలల్లోనే గాడిలో పెట్టారు. ఎక్కడా కూడా అవినీతికి తావులేని పాలన అందిస్తున్నారు. అంత సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలో కరోనా కోరలు చాచి కాటు వేయడం ప్రారంభించింది. ప్రపంచం మొత్తం వణికిపోయింది. ఏపీని కూడా కరోనా కబళించింది. అయినా…సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తొణకలేదు, బెణకలేదు. కరోనా అరికట్టే విషయంలో దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు అండ్ కో చేసే అనవసరపు విమర్శలు పట్టించుకోకుండా పూర్తిగా పాలన మీదనే సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టి పెట్టారు.

దేశంలో లాక్‌ డౌన్ మొదలైనప్పటి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏపీలో కరోనా వ్యాప్తి చెందకుండా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో లాక్‌ డౌన్‌ను అత్యంత పకడ్బందీగా అమలు చేశారు. ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండి సహకరించాలని వారికి అర్ధమయ్యేలా చెప్పారు. “మన కోసం, మన భవిష్యత్తు కోసమే లాక్‌ డౌన్‌ ” అంటూ ప్రజలకు చెప్పారు. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జోన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమైంది. ఏపీలో వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నట్లుగానే..కేంద్రం కూడా దేశం మొత్తాన్ని జోన్లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లగా విభజించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. రెడ్ జోన్లలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఏపీలో 676 మండలాలు ఉన్నాయి. 559 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. అంటే..559 మండలాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 83 శాతం మండలాల్లో ఒక కేసు కూడా లేదు.

ఇండియా లో సగటున కరోనా వలన మరణించిన వాళ్ళు 3 శాతం. ఏపీ లో 2.82 శాతం. ఇది జాతీయ సగటు కంటే తక్కువ.

అంతేకాదు..దక్షిణ కొరియా నుంచి లక్ష టెస్టింగ్ కిట్లు తెప్పించి పరీక్షల వేగాన్ని పెంచారు. వేగం పెరగడమే కాదు ఈ కిట్లు వలన 10 నిమిషాల్లో టెస్ట్ ఫలితం వస్తుంది. దీని వలన పాజిటివ్ ఉన్న వ్యక్తులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడవచ్చు. అంతేకాదు…దేశం మొత్తం మీద అత్యధిక టెస్ట్‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. దీంతో…తక్కువ కాలంలో కరోనాపై విజయం సాధించవచ్చు. దేశంలో సగటున 10 లక్షల జనాభాకు 451 టెస్టులు చేస్తుంటే.. అదే మన రాష్ట్రంలో 1,396 పరీక్షలు చేస్తున్నారు. దీన్ని బట్టే అర్ధమవుతుంది..సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలకు ఎంత విలువ ఇస్తున్నారో. కరోనాను ఎదుర్కోవడంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని ఎన్టీటీవీ చెప్పింది, కేంద్రం చెబుతోంది. కాని..చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాకు మాత్రం కనిపించవు, వినిపించవు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాకు మంచి కనిపించదు. రూ. 50 లక్షల బీమా కల్పించినందుకు వాలంటీర్లు సీఎం వైఎస్‌ జగన్‌ గారి చిత్ర పటానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా తట్టుకోలేక పోయింది. దీని మీద నానా రాద్దాంతం చేసింది. వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి నమస్కరించమని వాలంటీర్లకు ఎవరూ చెప్పలేదు. ప్రేమతో, అభిమానంతో తమ నాయకుడికి వారు దండం పెట్టారు. ప్రేమ, అభిమానాలను కూడా తప్పుబట్టడం చంద్రబాబు, ఎల్లో మీడియాకే చెల్లింది. అదే..చంద్రబాబు కాళ్ల మీద పడి దండాలు పెడితే మాత్రం ఎల్లో మీడియా మాట్లాడదు. ఎందుకంటే…చంద్రబాబు అవినీతి విష వృక్షాలే ఎల్లో మీడియా.

కరోనాపై ప్రపంచమంతా ఏకమై యుద్ధం చేస్తుంది. అమెరికాలాంటి అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయి. కాని..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా భయపడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్‌తో కరోనా పోతుందని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అంటే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత రాద్దాంతం చేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కొన్ని నెల రోజుల క్రితం చెప్పిన మాటనే ఈ రోజున అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లీచింగ్‌తో కరోనాను 5నిమిషాల్లో చంపేయవచ్చు. ఇది అమెరికా శాస్త్రవేత్త వైట్ హౌజ్ సాక్షిగా చెప్పిన మాట.

అమెరికా శాస్త్రవేత్తలు ఈ మాట చెప్పిన తరువాత ఎల్లో మీడియా మాట్లాడదు. కనీసం బ్రేకింగ్ వేయదు. చర్చలు అసలే పెట్టరు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎల్లో మీడియా అని ఓ రైతు సోషల్ మీడియాలో అనడం విన్నాను. ఆ రైతు మాట అక్షర సత్యం. ఎల్లో మీడియా లేనిరోజున ఏపీ దరిద్రం పోతుంది. మీడియా ఎందుకు ఉందనే కనీస అవగాహణ, పరిజ్ఞానం లేకుండా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాటలు, నిర్ణయాలపై ఈకలు పీకడమే పనిగా ఎల్లో మీడియా వార్తలు వండుతుంది. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా ?. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడం ఓర్చుకోలేక పిచ్చి, పచ్చ రాతలతో ఎల్లో మీడియా చెలరేగిపోతుంది. “రానున్న రోజుల్లో కూడా కరోనాతో ఉండాల్సి వస్తుంది” అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేశాయి. రానున్న రోజుల్లో అంటే మరి కొంత కాలం కరోనా ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఆయన ఉద్దేశం. దానిని వెటకారంగా వార్తలు వండి రాయడాన్ని, మాట్లాడటాన్ని జర్నలిజం అంటారా?!. ” మన జీవితంలో మాస్కులు భాగస్వామ్యం కానున్నాయి”- ప్రధాని మోదీ అన్నారు. “ఇప్పట్లో కరోనా పోదు” -WHO జనరల్ సెక్రటరీ అన్నారు. “మరో రెండేళ్లు కరోనా ఉంటుంది” – చంద్రబాబు మనిషి జేపీనే చెప్పారు. వీరు చెప్పిందే కదా సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పింది. జగన్‌ మాటలపైనే ఎల్లో మీడియా, టీడీపీ ఈకలు పీకడాన్ని చూస్తే వారి పిచ్చి, భయం పరాకాష్టకు చేరుకున్నాయని అనిపిస్తోంది.

ఒకపక్క కరోనాను కట్టడి చేస్తూనే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా దారి తప్పకుండా చూశారు. కరోనాతో ఇబ్బందులు రాకుండా ప్రతి ఇంటికి రూ.వెయ్యిలు పంచారు. నెలలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికీ 3 మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంచారు. ఆరోగ్యపరంగా రాష్ట్ర ప్రజలకు మంచి సలహాలు ఇస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌తో ఇరుక్కుపోయిన ఆంధ్రుల సంక్షేమం కోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. గుజరాత్ నుంచి 60 బస్సుల్లో వేలాది మత్స్యకారాలు ఆంధ్రాకు బయల్దేరారు. దీని కోసం వైఎస్‌ జగన్‌ రూ.3 కోట్లు కేటాయించారు. ఆ విధంగా వేలాది మత్స్యకారలు కుటుంబాల్లో ఆనందపు వెలుగులు, ధైర్యం నింపారు సీఎం వైఎస్‌ జగన్‌. కాని..ఇవి ఎల్లో మీడియాకు అస్సలు కనిపించవు. ఎందుకంటే ..వారికి కనిపించేది చంద్రబాబు పంపిన స్కిప్ట్ మాత్రమే. చంద్రబాబు నెలనెల పంపించే అవినీతి సొమ్ము మాత్రమే. జర్నలిజం ముసుగు వేసుకుని ఎల్లో మీడియా ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. ఎల్లో మీడియాకు ఈ మధ్య కాలంలో ప్రజలే సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో చర్చలు నడిపేవారిని సోషల్ మీడియాలో సామాన్యులే నిలదీస్తున్నారు. ఎల్లో మీడియా భవిష్యత్తులో కూడా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పోతే సామాన్యులే జర్నలిస్ట్‌లై, కోట్ల గొంతుకలై గర్జిస్తారు.

తెలుగు మీడియా కలాలు దాదాపుగా ఓ కులం కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలన చేసే మంచి పనులు చెప్పడానికి వారికి మనసు రాదు. అందుకే..ఇదిగో నాకు జగనన్న ఈ మంచి చేశారు.నేను జగనన్న పాలనలో ఈ లబ్దిపొందానని ప్రజలే సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా చెబుతున్నారు. టిక్ టాక్‌లో ఓ రైతు వీడియో చూశాను. ఎకన్నర పొలం. ఉదయం 8 గంటలకు కరెంట్ ఇస్తే సాయంత్రం 5 గంటలైనా వస్తూనే ఉన్నాయి. ఎకరంన్నర పంట తడిచింది చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ రైతు టిక్‌ టాక్‌లో వీడియో పోస్ట్ చేశాడు. మరో రైతు. ఈయన కడప జిల్లా. 5 ఎకరాల అరటి తోట వేశాడు.7 వేల మొక్కలు. తోట బాగా కాసింది. లాక్‌ డౌన్‌తో అరటి గెలలు కొట్టేవారే లేకుండా పోయారు.

ఆదే విషయం ఆ రైతు ఫేస్‌ బుక్‌లో పెట్టాడు. ఆ వీడియో చూసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆ రైతును ఆదుకోమని అధికారులను ఆదేశించారు. ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంత మంచి పాలన. చరిత్రలో ఇటువంటి పాలన గురించి చదివామే కాని..ఏపీలో చూస్తున్నాం. అంతేకాదు..లక్షల మంది మహిళలు సోషల్ మీడియాలో వైఎస్‌ జగన్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో కూడా డ్వాక్రా మహిళలకు రూ.1400 కోట్లు ఇచ్చారు. దీంతో 90లక్షల మంది లాభపడ్డారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.4వేల కోట్లు విడుదల చేశారు. దీంతో మహిళలు ఆనందంతో పొంగిపోతూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఎల్లో మీడియా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి.మీరు చూపించేది ప్రజలు నమ్మడం లేదు. ఎల్లో మీడియా రోజురోజుకు ప్రజల విశ్వసనీయతను కోల్పోతుంది. ఎల్లో మీడియా చంద్రబాబు స్క్రిప్ట్‌నే చదువుతుందని ప్రజలు ఓ అంచనాకు వచ్చేశారు. కాబట్టి..ప్రజలు ఎల్లో మీడియా రాతలకు వాతలు పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

చంద్రబాబుకు నాదో సలహా …మమ్మల్ని అడిగితే మేం సలహాలు ఇస్తాం, వారం రోజులు పాలన మాకు ఇవ్వండి మేమేంటో చూపిస్తాం అనే ప్రకటనలు పక్కన పెట్టండి. ప్రజలు మిమ్మల్ని 23 సీట్లు ఇచ్చి ఎందుకు పక్కన పెట్టారో నిజాయితీగా ఆలోచించుకుంటే మంచింది. మీ పాలన బాగాలేదనే కదా మిమ్మల్ని ప్రజలు సీఎం సీట్లో నుంచి లేపి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని కూర్చోపెట్టింది. మీ ఆలోచనలు, మీరిచ్చే సలహాలు నచ్చకనే కదా ఆ 23 మందిలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చింది. మిమ్మల్ని ప్రజలే కాదు, మీ పార్టీ నేతలు కూడా విశ్వసించడం లేదు. మీ పుట్టిన రోజు నాడు మోదీ మీకు విషెస్ కూడా చెప్పలేదు. అంటే..మీ పరిస్థితి మీకు బాగా అర్ధమవుతుంది అనుకుంటా..?!!!. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యసాధనలో అర్జునుడి వంటివారు. అర్జునుడి గురి తప్పనట్లే వైఎస్‌ జగన్‌ గురి కూడా తప్పదు. ఎందుకంటే.. వైఎస్‌ జగన్‌ చుట్టూ బార్బరికుడి బాణాలు రక్షణ కవచంగా ఉన్నాయి. ఆ బాణాలే..ఏకాగ్రత, సంకల్ప శక్తి, లక్ష్యసాధనలు.