ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలందరూ కూడా భావోద్యేగానికి గురైయ్యారు. ఎంతో కష్టపడితే కాని ఈ విజయం దక్కలేదని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంత్రి పదవులపై చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో కష్టపడిన వారందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు జగన్. పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొంతమందికి మంత్రి పదవులను అప్పగించారు. తనతో పాటు మంత్రి మండలిలో 26 మందికి చోటును కల్పించారు జగన్. వీరి మంత్రి పదవులు కేవలం రెండున్నర సంవత్సరాలే , ఆ తరువాత మరో కొంతమందికి మంత్రి మండలిలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారాయన. మంత్రలు ఎవరైనా అలసత్వం , అవినీతికి పాల్పడిన వారిని మంత్రి పదవుల నుంచి తొలగిస్తానని మొదట్లోనే తెలిపారు జగన్. జగన్ మాటలను కొందరు మంత్రులు లైట్ తీసుకున్నట్లు ఉన్నారు. దీని పరిణమమే ఆ ముగ్గురు మంత్రుల పదవులకు ఎసరు వచ్చింది. అవును మీరు వింటుంది. జగన్ తన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులను తొలగిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులను తొలగించడానికి రెడీ అయ్యారు. వారి పనితీరు నచ్చలేదో, మరో కారణమో తెలియదు కాని ముగ్గురు మంత్రులను మాత్రం వారి పదవులను తొలగించనున్నారు. అయితే ఈ ముగ్గురు మంత్రులు ఎవ్వరనేది హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మండలి నుంచి బయటికి వచ్చేసే ఈ ముగ్గురు మంత్రులు ఎవ్వరనే దానిపై అన్వేషణ కొనసాగించింది ప్రజా చైతన్యం ఛానెల్. ఈ రీసెర్చ్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రి మండలి నుంచి జగన్ తీసేసిన మంత్రులు వీరే అని తెలిసింది.

వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, విశ్వరూప్ వీరి ముగ్గురిని మంత్రి పదవుల నుంచి జగన్ తొలగించానున్నారని తెలుస్తోంది. వీరి పనితీరు నచ్చలేదో మరో కారణమో తెలియదు కాని వీరి ముగ్గురిని జగన్ తన మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చేయనన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం దేవదాయశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఈయన విజయవాడ ఈస్ట్ నియోజిక వర్గం నుంచి విజయం సాధించారు. ఈయన్ని తప్పించడానికి పెద్దగా కారణాలు ఏమి కనిపించకపోయినప్పటికీ , మంత్రి పదవి మాత్రం పొగొట్టుకోనున్నారని తెలుస్తోంది. పదవి పొగొట్టుకోబోతున్న మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎన్నికల చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలో అనుహ్యాంగా టిక్కెట్ సంపాదించారియన. ఈయన వైజాగ్, భీమిలీ నియోజిక వర్గం నుంచి ఘన విజయం సాధించారు. అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం టూరిజం శాఖమంత్రిగా పని చేస్తున్నారు.

అసలు అవంతికి మంత్రి పదవి వస్తుందని ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఈయన్ని కూడా తన మంత్రివర్గం నుంచి తప్పించడానికి జగన్ రెడీగా ఉన్నారని సమాచారం. మంత్రి అయిన దగ్గర నుంచి అవంతి శ్రీనివాస్ ప్రవర్తన ఏం లేదని టాక్ బాగా వినిపిస్తోంది. అందుచేతనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించనున్నారు. ఇక మూడో వ్యక్తి విశ్వరూప్. ఈయన ఈస్ట్ గోదావరి , అమలపురం నుంచి విజయం సాధించారు. ఎస్సీ కోటాలో మంత్రి పదవిని కూడా సంపాదించారు. ప్రస్తుతం ఈయన సోషల్ వెల్‌ఫెర్ మంత్రిగా కొనసాగుతున్నారు. విశ్వరూప్ తన మంత్రిత్వశాఖపై ఇప్పటి వరకూ పట్టు సాధించలేకపోయారని తెలుస్తోంది. అందుచేతనే ఈయన్ని కూడా మంత్రి వర్గం నుంచి తప్పించబోతున్నట్లూ వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పించి వీరి స్థానంలో మరో నేతలను తీసుకోనున్నారు జగన్.

ఇప్పటికే ఏపీలో రెండు మంత్రి స్థానాలు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభకు వెళ్లడంతో ,మరి కొద్ది రోజుల్లో వీరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరితో పాటు మరో ముగ్గురిని మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయడంతో మొత్తం 5 మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి. మరి 5గురిలో ఎవ్వరిని జగన్ తన మంత్రి వర్గంలోకి చోటు కల్పిస్తారో చూడాలి. ఏప్రిల్ 5న కాని 6వ తేదీన కాని ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం.