ఎండకాలం సైకిల్ తొక్కడం ఎందుకనుకుంటున్నారో లేక, సైకిల్ పనైపోయిందన భావిస్తున్నారో తెలియదు కాని వరుస పెట్టి టీడీపీ నాయకులు అధికార వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ప్రకాశం, కడప, అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు వైసీపీలో చేరడం మనం చూస్తునే ఉన్నాం. ఇక తాజాగా టీడీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు మద్దతివ్వడం విశేషం.

ఇలా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే పలువురు టీడీపీ నాయకులు వైసీపీ చేరడం చూసి బాబుగారు వెన్నులో వణుకు పుట్టింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఎన్నికలను జరగనివ్వకూడదని , ఎన్నికల కమీషనర్‌తో చేతులు కలిపి స్థానికి ఎన్నికలను వాయిదా పడేలా చేశారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికలు వాయిదా పడటంతో అధికార, ప్రతిపక్షాలు మాటల దాడికి దిగాయి. ఇలా ఎన్నికలు వాయిదా పడటంతో తెగ ఆనందపడిపోతున్నారు చంద్రబాబు. కాని ఆయనకు ఈ ఆనందం ఒక్కరోజు కూడా ఉండనివ్వడం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు.

సోమవారం పలువురు నాయకులు టీడీపీని వీడి వైసీపీలో చేరుతుండటం విశేషం. వీరిలో చాలా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారుడు గాదె మధుసూధన్ రెడ్డితో సహా పార్టీకి గుడ్‌బై పలికారు.చంద్రబాబు నాయుడి వైఖరి నచ్చకపోవడం వల్లే తాము పార్టీ ఫిరాయిస్తున్నామని ఆయన కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు నమ్మించి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయకులతో కాకుండా డబ్బులతోనే రాజకీయం చేస్తారని తీవ్రంగా విమర్శించారు.

బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తామని హామీ ఇచ్చిన ఆయన తన మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దీంతోనే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు గాదె వెంకటరెడ్డి. జగన్ వయస్సులో చిన్నవాడు అయినప్పటికీ కూడా కమిట్మెంట్‌తో పని చేస్తున్నారని తెలిపారు. ఒకటి , రెండు రోజుల్లో జగన్‌ను కలిసి పార్టీలో చేరుతామని తెలిపారు గాదె వెంకటరెడ్డి. ఆయనతో పాటు గాదె వెంకటరెడ్డి కుమారుడు కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గాదె వెంకటరెడ్డి గతంలో చాలాకాలంపాటు కాంగ్రెస్ పార్టీ కొనసాగారు. దివంగత నేత ,మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయంలో ఆయన మంత్రిగా పని చేశారాయన.