ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు ఊరటనిచ్చింది. అక్రమాస్తులు కేసులో ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాని తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల బీజీగా ఉన్నానని ఇటువంటి తరుణంలో తాను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాలేనని సీబీఐ కోర్టుకు రిక్వెస్ట్ చేశారు జగన్.

వ్యక్తిగతంగా హాజరుకాలేనని, దీని నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవ్యాది సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరుపు న్యాయవ్యాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, జగన్‌కు వ్యక్తిగత మినహాయింపుకు అనుమతినిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ న్యాయస్థానం.

ఇదే సందర్భంలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటికి రావడంతోనే నాపై అక్రమ కేసులు బనాయించారని జగన్ ఈ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు నాపై రాజకీయ కక్ష్యతోనే ఇలా కేసులు పెట్టారని కోర్టుకు విన్నవించారు జగన్. ఈ నేపథ్యంలో చార్జిషీట్‌ నుంచి జగన్‌ పేరును తొలగించాలని విజ్ఞపి చేశారు.