ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మొదటి ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అవుతోంది. తొలివిడత నామినేషన్ల స్వీకరణతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరో వైపు ఎస్ఈసీ రమేశ్ కుమార్ ప్రభుత్వంపై తన మొండి వైఖరిని వీడడం లేదు. అతను చేసే పచ్చపార్టీ అనుకూల కుట్రలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం తిప్పికొడుతూనే ఉంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరిస్తూనే మరో వైపు రమేశ్ బాబూ వ్యూహాలను అడ్డుకుంటోంది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికలల్లో అక్రమాలు జరుగుతున్నాయని అంటున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఓ వైపు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తూనే.. మరో వైపు కోడ్ అమలులో ఉందంటూ.. వైసీపీ సర్కారును కట్టడి చేసేందుకు యత్నిస్తున్నారు.

ఏపీలో పేరుకు పంచాయతీ ఎన్నికలే అయినప్పటికీ.. రాజకీయం అంతా ఏకగ్రీవాల చుట్టే తిరుగుతోంది. జగన్ సర్కారు సాధ్యమైనన్ని ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం చేయించేలా పావులు కదువుతోంది. ఇప్పటికే సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ పెడుతూ.. విజయంతంగా పూర్తి చేయాలని దిశా నిర్దేశనం చేశారు. అయితే ఏకగ్రీవం అనేది ఏ పార్టీకో.. వ్యక్తికో స్వలాభం కోసం చేసుకునేది కాదు.. ఎన్నికల్లో ఖర్చులు.. సిబ్బంది శ్రమను తగ్గించడం.. గ్రామాల్లో ఎలాంటి కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా ఉండేందుకు ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే ఈ ప్రక్రియను మొట్టమొదటి సారిగా వైఎస్. జగన్ మెహన్ రెడ్డి సర్కారే ప్రవేశపెట్టినట్లు.. నిమ్మగడ్డ రాజకీయం చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పడు ఏపీలో ఏకగ్రీవాల ప్రభుత్వం.. వర్సెస్ నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు అన్నట్లుగా సీన్ మారిపోతోంది.

రాష్ట్రంలో ఏకగ్రీవాలను అడ్డునేందుకు ఇప్పటికే అదనపు డీజీ స్థాయి అధికారి సంజయ్ ని నిమ్మగడ్డ నియమించారు. ఇప్పడు మరిన్ని వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా వాణీ మోహన్ ఉద్వాసనతో ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషన్ కార్యదర్శి పదిని భర్తీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నిమ్మగడ్డ నియమించిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దీంతో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కోసం నిమ్మగడ్డ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం అయ్యారు.

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకలతో నిమ్మగడ్డ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఈసీ అంటే రాష్ట్ర రాజధానిలో ఉండి ఎన్నికల వ్యవహారాలను సమీక్షించాలి. కానీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకగ్రీవాలు జరగకుండా జిల్లాస్థాయిలో అధికారులపై ఒత్తిడి పెంచేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా ఏకగ్రీవాలు అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశనం చేయాలని నిర్ణయించారు. స్వయంగా జిల్లాల్లో పర్యటించి జిల్లా అధికారులను తనదైన శైలిలో భయపెట్టి.. ఏకగ్రీవాలు అడ్డుకునే తన షాడో పార్టీ అయిన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా రమేశ్ కుమార్ వ్యూహం పన్నుతున్నారు.