తాజా మార్గదర్శకాలు ఇవీ..

  • స్టోర్‌లో పనిచేసేవారికి కరోనా వైరస్, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే వారు పనికి వెళ్లరాదు..
  • స్టోర్‌లలో రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు లోపలకు వచ్చే వినియోగదారుల సంఖ్యను తగ్గించాలి..
  • రెండువారాలకు మించి సరుకులు వినియోగదారులు కొనకుండా చూడాలి..
  • కస్టమర్లు వేచి ఉండాల్సి వస్తే క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి..
  • వినియోగదారుల మధ్య రెండు మీటర్లు, లేదా ఆరు అడుగుల దూరం ఉండేలా గుర్తులను వెయ్యాలి..
  • పెద్ద పార్కింగ్ సదుపాయం ఉన్న దుకాణదారులు కస్టమర్ల ఫోన్ నంబర్ల ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్ టోకెన్ విధానాన్ని అమలు చేయాలి..
  • ఆన్‌లైన్‌లో షాపింగ్ చెయ్యడానికి ప్రాధాన్యాత ఇచ్చి, ఇంటికే డెలివరీ చెయ్యాలి..
  • తమ ఉద్యోగస్తులకు కూడా ఎప్పటికప్పడు శరీర ఉష్ణోగ్రత చూడాలి
    101 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత దాటితో స్టోర్‌లలోకి అనుమతించకూడదు..
  • స్టోర్‌లలో ప్రవేశ ద్వారాల వద్ద, బయటికి వెళ్లే చోట హ్యాండ్ శానిటైజర్‌ను ఉంచాలి
    వినియోగదారులు వీలైనంత తక్కువ వస్తువులను తాకాలని సూచించాలి..
  • బిల్లులు చేసేవారు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం చాలా అవసరం..
  • వీలైనంత ఎక్కువగా ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేలా చూసుకోవాలి
    అలా కానిపక్షంలోనే నగదు తీసుకోవాలి..
  • నగదు ఇచ్చేటప్పుడు వలలను వాడాలి
    వినియోగదారుల నుంచి డబ్బులను చేతితో తీసుకోకుండా వలలో వేయాలని సూచించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో సూచించింది.