రాజకీయంగా వివాదాలను సృష్టించడం… పని జరగడం లేదని ప్రజల్లో కుక్కని పిచ్చి కుక్కగా ముద్రవేసి చంపే సామేత తరహాలో యాగి చేయడం… వీలైతే సాంకేతిక, న్యాయ పరమైన సమస్యలను కల్పించడం… తద్వారా పని ఆగిపోయేందుకు ప్రయత్నించాలనే కుట్రలు సాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడెతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు చకచకా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టుదలకు మేఘా శక్తి సామర్థ్యాలు తోడు కావడంతో అసాధ్యమల్లా అనతికాలంలోనే సుసాధ్యం కానుంది. ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వే, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

పోలవరం ప్రపంచంలోనే ఒక బృహత్తర ప్రాజెక్టు. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుతవ్. ప్రాజెక్ట్ లోని ప్రధానమైన స్పిల్ వే డ్యాం, కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందివ్వడంతో పాటు తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడం మరియు జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం.

అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్రలో…
పోలవరం ప్రాజెక్ట్ ఎంత క్లిష్టమైనదో అంత సుదీర్ఘమైన చర్చ, 1941లో ప్రతిపాదించగా 2005లో రాజశేఖర రెడ్డి (నాటి సీఎం) చేతుల మీదుగా పని ప్రారంభం. దాదాపు పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అనుమతులన్నీ ఆయన హయాంలోనే వచ్చాయి. ధవళేశ్వరానిరి 40 కిలోమీటర్ల ఎగువన రామయ్యపేట వద్ద నిర్మాణం, 2014లో రాష్ర్ట విజభన సమయంలో జాతీయ ప్రాజెక్ట్ కేంద్రం నిధులు. 194.6 టిఎంసీల నిల్వ, 320 టిఎంసీల వినియోగమే లక్ష్యం, 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 23.5 లక్షల ఎకరాల స్థీరీకరణ, 80 టిఎంసీల వరదనీరు క్రిష్ణాకు మళ్లింపు, విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టిఎంసీలు, ఒడిషాకు 5, ఛత్తీస్ ఘడ్ 1.5 టిఎంసీల నీరు.

రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం కుడి కాలువకి సంబంధించిన ప్రధానమైన పనులన్ని పూర్తి అయ్యాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్ట్ పనులు ముందుకు కదలలేదు. తదనానంతరం రాష్ట్ర విభజన జరగడం, కేంధ్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన స్వప్రయోజనాల కోసం ప్రాజెక్టును పర్సనల్ ప్రాజెక్టుగా వాడుకున్నారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును నేనే కడతానని కేంద్ర ప్రాజెక్టుని రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చి రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టి కొట్టారు. ఆయన హయాంలో పోలవరం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ జాప్యం వలన ప్రాజెక్టు వ్యయం మరింతంగా పెరిగి రాష్ర్టానికి గుదిబండగా మారింది.

2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం పనులు ముందుకు సాగాలంటే రివర్స్ టెండరింగ్ విధానంతో పాటు ద్వారా రాష్ట్ర ఖజనాకు ఆదాయాన్ని మిగుల్చుతు పోలవరం నిర్మాణ పనుల మహత్తర కార్యాన్ని మేఘా కంపెనీకి అప్పగించారు. 2019 నవంబర్ లో పనులు మేఘా పనులను పకడ్బందీగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగించి పనులు మొదలు పెట్టి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ లో అన్నీ భారీవే, అరుదైనవే…

పోలవరంలో అన్నీ అరుదైన, భారీవే. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో 1.18 కిలోమీటర్ల పొడవైన నిర్మాణం, 55 మీటర్ల ఎత్తుతో 51 బ్లాకులు, నదీ గర్భంలో మూడు (ఈసిఆర్ఎఫ్ గ్యాప్..1,2,3) రాతి, మట్ట కట్ట నిర్మాణాలు, ఈ మూడింటి పొడవు 2.35 కిలోమీటర్లు. ఇవి అరుదైన, అతిపెద్ద నిర్మాణాలు. స్పిల్ వే వైపు అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ఎంత పెద్ద వంటే 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించేలా నిర్మిస్తున్నారు. అప్రోచ్ ఛానెల్ 2.31 కిలోమీటర్ల పొడవు, స్పిల్ ఛానెల్ మరింత పెద్దది. ఇది 1000 మీటర్ల (1 కి.మి) వెడల్పు, 2.94 కిలోమీటర్ల పొడవు, పైలెట్ ఛానెల్ 1000 మీటర్ల వెడల్పు, 1000 మీటర్ల పొడవు.

ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న, ప్రకృతి వైపరిత్యాల వలన తీవ్రమైన వరదలు సంభవించిన మొక్కవోని దీక్షతో పనులు కొనసాగించి పోలవరం ప్రాజెక్టు కి ఒక రూపు తీసుకు వచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతి కొద్ది సమంలోనే పోలవరం ప్రాజెక్టు యొక్క కాంక్రీట్ పనులను చాలా వరకు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిరూపించారు.

అధునాతన భారీ రేడియల్ గేట్లు
ప్రపంచంలోనే భారీ వరద నీరు ప్రవహించే విధంగా నిర్మిస్తున్న స్పిల్ వే లో భారీ గేట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 48 గేట్లు హైడ్రాలిక్ పద్ధతిలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇవన్నీ రేడియల్ తరహా గేట్లు, గేట్ల క్రష్ట్ లేవల్ + 25.72 మీటర్లు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ‘(ఎఫ్ ఆర్ ఎల్/ఎమ్ ఆర్ ఎల్) + 45.72 మీటర్లు, 20 మీటర్ల ఎత్తు మేర నీటిలో గేట్లు, ఒక్కొక్క గేటు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో భారీ గేట్లుగా అరుదైన గుర్తించవచ్చు. అలాగే అధునాతనమైన ప్రి స్ట్రెస్డ్ కేబుల్ తో పాటు ఈ ఒక్కొక్క గేటు పని వేగం నిమిషానికి 0.5 మీటర్లు.

గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం ఆగమ్య గోచరంగా ఉండేది. ముఖ్యమంత్రి రంగం లోకి దిగాక అనతికాలంలోనే 28 మీటర్లు ఎత్తు గా ఉన్నా పియర్ పిల్లర్లను 52 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. మొత్తం 192 గడ్డర్స్ పూర్తి చేసి, 84 గడ్డర్లను స్పిల్ వే పై అమర్చడంతో పాటు మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన షట్టరింగ్ పనులను శరవేగంగా చేస్తున్నారు. పియర్ పిల్లర్ల పై 250 మీటర్ల పొడవైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణము పూర్తి చేశారు. వీటి తో పాటే ప్రాజెక్ట్ లో కీలకమైన ట్రన్నియన్ బీమ్స్ ని అత్యాధునిక యంత్ర సామగ్రి తో అమర్చు తున్నారు. ప్రాజెక్ట్ స్పిల్ వే కి సంబంధించి 1,94,944 క్యూబిక్ మీట ర్లు మరియు స్పిల్ ఛానల్ కి సంబంధించి 10, 64, 417 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కావాలని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే వారి ఆశలు నేరవేర్చే విధంగా త్వరలోనే పోలవరం ఫలాలు అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఒక యజ్జంలా, ముఖ్యమంత్రి Y S జగన్ మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన సమయం లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని మేఘా కృత నిశ్చయంతో ఉంది.