• కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలి
  • ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవు
  • వైయస్సార్‌ నవోదయం పధకం కింది ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్రయోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ,ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉంది
  • స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టి పెట్టాలి
  • మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్ఫధంతో ఉండాలి
  • రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న 6 జిల్లాల్లో ఒకలా, మిగిలిన 7 జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లుఉన్నాయి
  • బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి
  • 12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేసుకుంటూ పోతున్నారు
  • వడ్డీరేట్ల విషయలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
  • మరోవైపు ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం ఆలోచించదగ్గ విషయం:
  • వైయస్సార్‌ కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలుచేయాలి
  • గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం
  • గ్రామాల ఆర్థిక వ్యస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం
  • గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నాం
  • గ్రామ సచివాలయలు, విలేజ్‌ క్లినిక్కులు, ఇంగ్లిషు మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకు వస్తున్నాం
  • గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు
  • ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రం) లో ఇంటర్నెట్‌ కియోస్క్‌ అందుబాటులో ఉంటుంది
  • ఈ కియోస్క్‌ద్వారా తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్‌ చేస్తే నాణ్యతా నిర్దారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయి
  • అలాగే ఈ– పంటలో విలేజ్‌ అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లతో వివరాలు నమోదు చేయిస్తున్నాం
  • దీనికోసం వీరందరికీ కూడా ట్యాబులు ఇస్తున్నాం
  • ఈ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తాం
  • డిమాండు సప్లయిలను పరిగణలోకి తీసుకుని ఏ పంటలు వేయాలన్నదానిపై రైతుకు ఆర్బేకేల ద్వారా సూచనలు చేస్తాం
  • ఈ– పంటలో నమోదైన వివరాల ఆధారంగా సాగుచేస్తున్న పంటలకు తగినట్టుగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది
  • అలాగే కౌలు రైతులు సాగుచేస్తున్న పంట వివరాలు అందుబాటులో ఉంటాయి
  • రెవెన్యూ అసిస్టెంట్లు ద్వారా కౌలు రైతు, యజమాని ఇద్దరూ అగ్రిమెంటు మీద సంతకం చేసి బ్యాంకు రుణం కోసం ఇస్తారు
  • బ్యాంకులు వారికి ఉదారంగా రుణాలు ఇవ్వాలి
  • రైతులకు పండించిన పంటకు తగిన ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
  • తాను ఆశించిన ధర రాకపోతే రైతులు ఆర్బీకే ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తారు
  • ధర రాని పక్షంలో ప్రభుత్వం జోక్యంచేసుకుని మార్కెట్లో పోటీని పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది
  • మే 15న ఆర్బీకే ద్వారా రైతు భరోసా ఇవ్వబోతున్నాం
  • మైక్రోఎంటర్‌ ప్రైజెస్‌ కోసం జూన్‌లో ఓ పథకాన్ని ప్రారంభించబోతున్నాం: గుర్తింపు కార్డులతో రూ. 10వేలు చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన
  • చిరు వ్యాపారులు, తోపుడు బళ్లమీద చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు
  • ఇది వాళ్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
  • మాకు కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి
  • వాటిని నెరవేర్చడానికి మీ సహకారం చాలా అవసరం
  • కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది
  • రాయలసీమ కరువు నివారణా చర్యల్లో భాగంగా వరదజలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరిస్తున్నాం
  • ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరు పోవాలి
  • దివంగత నేత వైయస్సార్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది
  • వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీటి సరఫరా అందించాలి
  • తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్‌ వల్ల నీరు కలుషితం అవుతుంది
  • శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితులు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ప్రజలకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీటిని అందించడానికి ముందడుగు వేస్తున్నాం