మందు బాబులకు గడ్డుకాలం..:AP లో మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు…కొత్త గా 535 వైన్ షాపులు మూసివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ ఇక మందు (మద్యం) దొరకడం కష్టమేనని అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో..మద్యపాన నిషేధం దిశగా మారబోతోంది ఏపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత..ఇచ్చిన హామీలను పక్కగా అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కో హామీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో మద్యపానం ఒకటి. ఒకేసారి కాకుండా..మెల్లిమెలిగా మద్యంపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. అందుకనుగుణంగా…లిక్కర్ పై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులు ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తో దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో లిక్కర్ షాపులు క్లోజ్ అయ్యాయి.

తాజాగా 3500 ఉన్న వైన్ షాప్ లలో 535 షాపులలో చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది దీనితో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు పడినట్లయింది కానీ ఈ వార్త మద్యపాన ప్రియులకు శరాఘాతంలా తగిలింది.