రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) శనివారం రాత్రి వెల్లడించారు. హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్‌కుమార్‌ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్‌ శుక్రవారం  సర్క్యులర్‌ జారీ చేసింది.

రమేశ్‌కుమార్‌ పునర్నియామకం చట్టవిరుద్ధమని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చెప్పడంతో రమేశ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టినట్లు తొలుత ప్రకటించిన ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి.. శుక్రవారం నాటి సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు శనివారం రాత్రి వెల్లడించారు. పునర్నియామకంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున సర్క్యులర్‌ని వెనక్కి తీసుకున్నట్లు కమిషన్‌ అధికారి ఒకరు తెలిపారు