ఏీపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. జగన్ అందిస్తున్న పనిపాలనపై వివిధ రాష్ట్రాల
నాయకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఢిల్లీ, కేరళ, మహరాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలు జగన్ చేస్తున్న అభివృద్దిని ప్రశంసించిన సంగతి అందరికి
తెలిసిన విషయమే. జగన్ పరిపాలన పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు జగన్.
ఇప్పటికే తాను ఇచ్చిన హామీలను 75 శాతం అమలు చేశారు కూడా. తాను ఇవ్వని హామీలను సైతం అమలు చేయలని చూస్తున్నారు జగన్. తాజాగా
జగన్ మరో సంచలనానికి తెర లేపారు. గత 120 ఏళ్ళలో ఏ సీఎం చేయని పనిని చేయడానికి శ్రీకారం చూట్టారు. దీనిపై పూర్తి వివరాల్లోకి
వెళ్తే..

ఏపీని పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు జగన్. దీని కోసం తన శయశక్తులు కృషిచేస్తున్నారు. గతంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని చేయడానికి సన్నాద్దం అవుతున్నారు. అవినీతి రహిత పరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు జగన్. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. దీనిపై ఎన్ని అవంతరాలు వచ్చిన లెక్క చేయడం లేదు. ఏపీలో అతి త్వరలోనే సమగ్ర భూసర్వే చేయించనున్నారు జగన్. ఏపీలో అక్రమ రిజేస్ట్రేష్టన్లు జరిగాయని ఓ నివేదికలో తేలడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది, కొందరు తమ పేర్లపై కాకుండా అక్రమంగా వేరే వారి పేర్లపై భుములు కొనుగొలు చేసినట్లు సమాచారం. దీంతోనే ఏపీ మొత్తం జగన్ సమగ్ర భూ సర్వే చేయించాలని డిసైడ్ అయ్యారట. ఇలా చేయడం ద్వారా అవినీతిపరులకు అక్రమార్కులకు చెక్ పెట్టినట్లు అవుతోంది. దీని ద్వారా అసలైన హక్కుదారులకు భూమి దక్కుతుంది.

భూవివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని జగన్ కలలు కంటున్నారు. అందుకే 120 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని చేయడానికి రెడీ అవుతున్నారు
జగన్. బ్రిటీష్ వాళ్ల సమయంలో జరిగిన భూ సర్వే మళ్లీ , ఇప్పటి వరకు సమగ్ర భూసర్వే జరగింది లేదు. నిజానికి 30 ఏళ్లకోసారి సమగ్ర భూ సర్వే జరగాలి. అయితే తమ స్వలాభం కోసం గత ప్రభుత్వాలు భూ సర్వే చేయించలేదు. తమ నేతల అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని గత ముఖ్యమంత్రులు ఈ సర్వే చేయించలేదు. కాని జగన్ ఇవి ఏమి ఆలోచించకుండా సమగ్ర భూ సర్వే చేయించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లూ తెలుస్తోంది.

ఎన్టీఆర్ సీఎం అవ్వగానే ఈ భూ సర్వే వ్యవస్థను రద్దు చేశారు. గ్రామాల్లో కరణాల వ్యవస్థ ఉన్నంత కాలం భూరికార్డులు సరిగ్గానే ఉన్నాయని తెలుస్తుంది.
ఆ తరువాతే అక్రమార్కులు రెచ్చిపోయ్యారు. తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమార్కులు ఎవరో బయటపడనుంది. ఈ భూ సర్వే కనుక విజయవంతం అయితే పేదవారికి న్యాయం జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అవినీతి రహిత సమాజం కోసం కష్టపడుతున్న జగన్‌కు ఈ సర్వే చాలా
ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ సమగ్ర భూ సర్వేను చేపట్టనుంది వైసీపీ సర్కార్.