• రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి చొరవతో వారణాసి నుండి తెలుగు రాష్ట్రాలకు బయలుదేరుతున్న 1000 మంది యాత్రికులు..
  • లాక్-డౌన్ కు ముందు వారణాసి యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన
  • ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది భక్తులకు అండగా నిలిచిన బిజెపి రాజ్యసభ సభ్యులు శ్రీ నరసింహారావు గారు.
  • కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది తెలుగు యాత్రికులు వారణాసిలో చిక్కుకున్నారు.
  • అక్కడ వారికి వసతి, ఆహార సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి రాజ్యసభ సభ్యులు శ్రీ జీవిఎల్ నరసింహారావు గారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మరియు వారణాసి కి చెందిన అధికారులతో సమన్వయం చేస్తూ గత నెల 22వ తేదీ నుంచి వారి యోగక్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ జీవిఎల్ నరసింహారావు గారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
  • గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి కార్యాలయ అనుమతితో శ్రీ జీవిఎల్ నరసింహారావు గారు నేడు 1000 మంది తెలుగు యాత్రికులను తమ తమ నివాసాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టారు.
  • నేటి సాయంత్రం శ్రీ జీవిఎల్ నరసింహారావు గారి నేతృత్వంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల ద్వారా రెండు తెలుగు రాష్ట్రలకూ యాత్రికులను పంపుతోంది.
  • యాత్రికులు పూర్తిగా ఇంటికి చేరే వరకు వారు ప్రయాణించే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రంలోని వారు ఉన్న జిల్లాలోని అధికారులను సమన్వయం చేస్తున్నామని జీవీఎల్ నరసింహరావు గారు తెలిపారు.