స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలి హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాం డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చాం పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలి, దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తాం, మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది: సీఎం

జిల్లా ఎస్పీలు డబ్బులను, మద్యాన్ని అరికట్టాలి ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసును పూర్తిస్థాయిలో వినియోగించాలి ఎక్కడా డబ్బు పంపిణీచేశారన్న మాట రాకూడదు ఎన్నికల్లో లిక్కర్‌ పంచారన్న మాట రాకూడదు వరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి కోట్లుకోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడంకాదు, ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సేవచేసే వ్యక్తులు ఎన్నిక కావాలి, అందుకే కోసమే ఈ మార్పులు తీసుకు వచ్చాం మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి

సాధారణ ఎన్నికల ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్‌ ఉపయోగించిన మాదిరిగానే స్థానిక సంస్థల ఉన్నికలకు కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంచాలి ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు ఈ డేటా చేరాలి గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రులు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా మిత్రులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈయాప్‌ ఉండాలి ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి: ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయాలి, జైలుకు పంపాలి: