ఏపీ సీఎం జగన్.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఇద్దరు విరుద్ధ స్వభావం గల వ్యక్తులు. జనసేన నేతగా వెలుగు వెలిగి.. ఆ పార్టీ నచ్చక బయటకు వచ్చిన జేడీ ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజాసేవను ఒంటరిగా చేసేందుకు యోచిస్తున్నారు. ఇక ప్రస్తుత కరోనా టైంలో సీఎం జగన్ చురుకుగా వ్యవహరిస్తూ కరోనా కట్టడిలో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. తాజాగా కరోనాను చూసి భయపడవద్దని జనాలకు సూచన చేశారు. ఇది ఒక మామూలు జ్వరంలాంటిదేనని.. వస్తూ పోతూ ఉంటుందని.. కరోనాకు ఎవరూ భయపడవద్దని జగన్ ఏపీ ప్రజలకు భరోసానిచ్చారు.

అంతేకాదు.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జగన్ ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు. కేంద్రం చేతులెత్తేసినా ఏపీ సీఎం జగన్ మాత్రం మొండి ధైర్యంతో ఏపీ ప్రజలకు సేవలందించేందుకు ముందుకెళ్తుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. ఒకవైపు కరోనా విపత్తు ఉన్నా దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ ఏపీని శిఖరాగ్రాన జగన్ నిలిపారు. మరోవైపు లోటు బడ్జెట్ వెక్కిరిస్తున్నా.. ఏపీ ప్రజలకు తాను ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లోటు రాకుండా ముందుకు వెళుతున్నారు. కరోనా విపత్తుతో సంబంధం లేకుండా ఇంతటి కష్టకాలంలోనూ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి మనసులు దోచుకుంటున్నారు.

ఇంతటి కరువులో పక్కరాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగులకు సగం జీతాలిస్తున్నారు దేశంలోనే ధనిర రాష్ట్రం సీఎం కేసీఆర్. కానీ ఏపీ సీఎంజగన్ మాత్రం ఫుల్ జీతాలు ఇస్తూ నిన్నటికి నిన్న వాహనమిత్ర పథకం కింద ఏకంగా డ్రైవర్లకు రూ.10వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రైతులకు రైతు భరోసా అందిస్తూ జగన్ రైతుల పాలిట పక్షిపాతిగా నిలిచాడు.

జగన్ పాలనకు ఫిదా అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ రైతు నాగలి కర్రులోనే ఉందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా ఏపీలోని తన దత్తత గ్రామమైన చిన్న మంగలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 20మంది రైతులను సన్మానించారు. తర్వాత రైతులతో కలిసి పాడి ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీలోని జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని.. యువత వ్యవసాయంవైపు అడుగులు వేయాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చాడు. తెలంగాణలో, ఏపీలో నియంత్రిత సాగుపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు వినూత్న డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ప్లాన్లు చేస్తున్నారని.. అందరూ ఒకే పంట పండిస్తే రైతుకు మద్దతు ధర దక్కదని.. మార్కెట్లో ధరలు ఉండవని.. అందుకే రైతులకు లాభాలు పండించే పంటలనే పండించాలని సీఎంలు నిర్ణయించారని తెలిపారు. అప్పుడే రైతులు ధనవంతులు అవుతారని.. అప్పుడు ఆ సమాజం ముందుకు వెళుతుందని జేడీ అన్నారు.

ఏపీలో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల కష్టాలు తీర్చాడని.. నవరత్నాలు అమలు చేసి పేదలను బాగు చేస్తున్నారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. రైతులకు డైరెక్టుగా డబ్బులిస్తూ జగన్ ఏపీ రైతుల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మార్చివేశాడని.. ఇలాంటి సీఎంలు ఉండడం వల్లే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు తగ్గి రైతులు బాగుపడుతున్నారని జగన్ పాలనను జేడీ వేయినోళ్ల పొగిడారు.