రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది యాంకర్ రష్మీ . కెరీర్ మొదట్లో పెద్దగా తెలుగు రాకపోయినప్పటికీ కూడా తన అందంతో అందరి ద‌ృష్టిని ఆకర్షించింది . జబర్దస్త్, ఢీ వంటి మొదలగు ప్రొగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది రష్మీ. పలు సినిమాల్లో హాట్, హాట్‌గా కనిపించి యువకుల గుండెల్లో చిచ్చు రేపిందామె. టీవీ షోలు సినిమాలే కాకుండా సోషల్ ఎవర్నెస్ ప్రొగ్రామ్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది రష్మీ. తాజాగా ఈ అమ్మడు ఏపీ సీఎం జగన్‌పై చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే….

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌‌తో వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని బారిన పడి ఇప్పటి వరకూ సుమారు 6000 వేల మందికి పైగా మరణించారు. కరోనా ప్రభావం ఇండియా మీద కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఈ వైరస్ వల్ల ఇండియాలో ఇప్పటికే ఇద్దరు మరణించినట్లూ ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా కరోనా వైరస్ వల్ల ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. దీనిపై స్పందించిన సీఎం జగన్ … ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేదని , ఇప్పటి వరకూ కేవలం ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువుగా ఉండే మనలాంటి రాష్ట్రాల్లో కరోనా లాంటి వైరస్ ఎక్కువుగా ప్రభావం చూపించలేదని తెలిపారు జగన్. పారాసిటమల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనాకు సరిపోతుందని చెప్పుకొచ్చారాయన.

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై యాంకర్ రష్మీ స్పందించింది. . మన దేశ ప్రభుత్వం కూడా కరోనా జాతీయ విపత్తుగా ప్రకటించింది. అలాంటి భయంకరమైన కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రజలు గందరగోళం పడుతుంటే.. మన తెలుగు రాష్ట్రాల సీఎంలు పారాసిటమల్ గోలి వేసుకుంటే సరిపోతందని చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పారుంటూ ఓ ట్వీట్ చేసిందామే. ప్రపంచమే దీనిని పెద్ద భూతంలా చూస్తున్నారంటూ మండిపడింది. అయితే రష్మీ ట్వీట్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. పారాసిటమల్‌ గురించి జగన్‌ చేసిన కామెంట్స్ రష్మీ వ్యంగ్యంగా కామెంట్స్ చేసిందని ఆయన అభిమానులు ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.