ఏపీ సీఎం జగన్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చాలా ఇష్టం. కారణాలు తెలియదు కాని జగన్ అన్న కాని , ఆ పార్టీ నాయకులు అన్న కాని ఎక్కువుగా ఇష్టపడుతుంటారు ప్రధాని మోదీ. ఆ పార్టీ నాయకులు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇస్తుంటారు మన ప్రధాని. జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓ కంట కనిపెడుతునే ఉంటారు. సీఎం జగన్ కూడా మోదీకి అధిక ప్రాధన్యతను ఇస్తుంటారు. రైతు భరోసా పథకానికి ప్రధాని పేరును పెట్టాలని నిర్ణయించారు జగన్. అయితే తన పేరు అవసరం లేదని ,పథకాలు ప్రజలకు చేరితే చాలని కోరారు ప్రధాని మోదీ. తాజాగా జగన్ తీసుకున్న శాసన మండలి రద్దు గురించి ప్రధాని మోదీతో చర్చించారట వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి.

పార్లమెంట్‌లో ఏపీ శాసన మండలి రద్దు బిల్లును ఎలాగైనా ఆమోదం పొందేలా సహకరించాలని ప్రధానిని కోరారట విజయసాయిరెడ్డి. శాసన మండలి రద్దు గురించి సానుకూలంగానే స్పందించారట మోదీ. శాసన మండలి రద్దు బిల్లు పాస్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలో విజయసాయి రెడ్డి తెలియజేశారట మోదీ. ప్రధాని హామీ ఇవ్వడంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నారట వైసీపీ నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో శాసన మండలి రద్దు కాకుండా చూడాలని టీడీపీ నాయకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఏకంగా ప్రధాని మోదీనే హామీ ఇవ్వడంతో షాక్ ఉన్నారట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.

ఏపీ శాసన మండలి రద్దు బిల్లు పాస్ కాకుండా చూడాలని జాతీయ నాయకులను కలుద్దాం అనే ప్లాన్ వేశారట చంద్రబాబు. సోనియా గాంధీ, మమత బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నాయకులను కలిసి బిల్లు పాస్ కాకుండా చేయలని వ్యూహాలు రచించారట బాబుగారు. అయితే ఏపీ శాసన మండలి రద్దు విషయంలో ఏకంగా మోదీనే జోక్యం చేసుకోవడంతో , జాతీయ నాయకులను కలిసే ఆలోచనను విరమించుకున్నారట చంద్రబాబు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులను కలిస్తే భవష్యత్తులో చాలా సమస్యలు వస్తాయానే చంద్రబాబు వెనకడుగు వేశారని తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ తాను అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తున్నారు ఏపీ సీఎం జగన్. ప్రధాని మోదీతో ఉన్న స్నేహపూరితం వల్ల ఏపీ శాసన మండలి రద్దు బిల్లును ఆమోదింపచేసుకోవాడానికి ఉన్న అన్ని దారులను ఉపయోగించుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు జగన్. అయితే పార్లమెంట్‌లో ఇప్పటికే చాలా బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. వాటి కన్నా ముందే ఏపీ శాసన మండలి రద్దు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకొవాలని చూస్తున్నారు జగన్.