గత కొద్దిరోజులుగా ఏపీ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారనే దానిపై తీవ్ర చర్చ కొనసాగింది. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీరే అని సోషల్ మీడియాలో చాలామంది పేర్లు వినిపించాయి. సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఖారారైందనే వార్త బలంగా
వినిపించింది. ఇక సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల పేరు కూడా రాజ్యసభ రేసులో ఉన్నారని కొన్ని వార్త ప్రత్రికలు ప్రచురించాయి. మరో సినీ నటుడు
మోహన్ బాబుకు కూడా వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారని అనేక ప్రాధమిక మాద్యమాల్లో కనిపించింది. అయితే జగన్ నోటి నుంచి ఏ పేర్లు అయితే
వస్తాయె వారే కన్ఫర్మ్ అని పార్టీ వర్గాలు తెలిపాయి తాజాగా ప్రజా చైతన్యం ఛానెల్‌కు అందుతున్న సమాచారం ప్రకారం సీఎం జగన్ ఇద్దరి రాజ్యసభ సభ్యుల
పేర్లను ఖారారు చేసినట్లూ తెలిసింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో మొత్తం నాలుగు స్థానాలను కూడా
వైసీపీనే గెలుచేకునే అవకాశం ఉంది, రాజ్యసభకు ఎవ్వరిని పంచించాలనే అనే దానిపై జగన్ సుదీర్ఘ ఆలోచనలు చేశారని తెలుస్తోంది, పార్టీతో చర్చించి
మొదట రెండు పేర్లను ఖారారు చేశారు జగన్. ఆ ఇద్దరు మరెవ్వరో కాదు….అయోద్య రామిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ. వీరిద్దరి పేర్లను
రాజ్యసభ సభ్యుల లిస్ట్‌లో చేర్చారు జగన్. వీరిద్దరు పేర్లు ఖారారు అయినట్లూ పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. మొదటి నుంచి పార్టీకి అండగా ఉండటంతోనే
వీరిద్దరికి అవకాశం కల్సించారు జగన్.

అయోద్య రామిరెడ్డి ప్రొఫైల్‌ను ఓసారి గమనిస్తే ఆయన గుంటురు జిల్లా నరసారావు పేటలో జన్మించారు. ఆయన బాల్యం అంత అక్కడే గడిచింది. ఆయన
ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయోద్య రామిరెడ్డి మొదటి నుంచి జగన్‌కు అండగా ఉండటంతోనే ఆయనకు రాజ్యసభ సీటు
దక్కిందని తెలుస్తోంది. ఇక మరో సభ్యుడైన మోపిదేవి వెంకట రమణ ప్రొఫైల్‌ను గమనిస్తే ఆయన కూడా గుంటురు జిల్లాకు చెందిన నేత కావడం గమనర్హం.
మోపిదేవి కూడా మొదట నుంచి జగన్‌కు అండగా , తోడుగా నిలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో మోపిదేవి వెంకట రమణ ఓడిపోయినప్పటికి, ఆయన్ని
ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని కూడా అప్పగించారు జగన్. కాని మూడు రాజధానుల నిర్ణయంతో , ఏపీ శాసన మండలిని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో
తన మంత్రి పదవికి సైతం వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు మోపిదేవి. ఏపీ శాసన మండలి రద్దు కాకముందే జగన్ మోపిదేవికి రాజ్యసభ సీటు
ఆఫర్ చేయడం గొప్ప విషయం అని అంటున్నాను వైసీపీ నాయకులు.

ప్రస్తుతానికి వీరిద్దరి పేర్లను కన్ఫర్మ్ చేశారు సీఎం జగన్. త్వరలోనో మరో ఇద్దరి పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది.. అయితే ఈ రేసులో చాలామందే
ఉన్నారు. రాజ్యసభ రేసులో వైఎస్ షర్మిల, చిరంజీవి, మోహన్ బాబు, బీద మస్తాన్ రావు మొదలగు వారి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవ్వరికి అవకాశం దక్కుతుందో చూడాలి.