టీడీపీ సీనియర్ లీడర్ , అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి మరోసారి తన నోటికి పని చేప్పారు. గత కొంతకాలంగా ఆయన జగన్‌కు మద్దతుగా మాట్లాడుతూ చంద్రబాబును ఇరకాటంలోకి నెడుతున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపీణీ చేయడానికి వీల్లేదని చెప్పారు సీఎం జగన్. డబ్బు, మద్యం పంపీణీ చేస్తు తన సొంత పార్టీ వారైనా దొరికితే తీసుకువెళ్లి బొక్కలో వేయలని ఆదేశాలు జారీ చేశారాయన. దీంతో ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థలు ఎన్నికల తీరుపై ఆ మధ్య స్పందించారు జేసీ దివాకర్ రెడ్డి. ఎన్నికల్లో డబ్బు ,మద్యం లేకపోతే ఎవడు పోటీ చేస్తాడు, మేం పోటీ చేయం అని చెప్పి సంచలనమే రేపారు.

ఇలా అయితే మొత్తం సీట్లు మావాడే గెలుస్తాడని , జగన్‌ను ఉద్దేశించి మాట్లాడరాయన. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ,అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. దీనిపై అధికార ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఏపీ ఎన్నికల కమిషనర్‌ను జేసీ కలవడం సంచలనంగా మారింది.స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఆయన మరోసారి జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ చాలా తెలివైనవాడని అన్నారు. సీఎం చర్యలతో ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని అన్నారు.

తాను టీడీపీ అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని రూల్ లేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గ విషయమేనని అన్నారు. రాష్ట్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఉండాలని జేసీ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఈసీదేనన్నారు. ఈ ఎన్నికల వాయిదాపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు. నామినేషన్లకు ముందు, తర్వాత ఏం జరుగుతుందో అందరికి తెలుసునని చెప్పుకొచ్చారు. ఇలా పలుమార్లు జగన్‌పై పొగడ్తల కురిపించడం చూస్తుంటే ఆయన కూడా వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నాయకులు వైసీపీలోకి క్యూ కట్టిన సంగతి తెలిసింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన పరిటాల ఫ్యామిలీ కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి తరుణంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా వైసీపీలో చేరతారో లేక టీడీపీలోనే కొనసాగుతూ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తారో చూడాలి