చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనికి రాష్ట్రం అంత కూడా అభిమానులు ఉన్నారు. అందంతోపాటు తన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు విడుదల రజని. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధాంగా ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించి చిలకలూరిపేట నియోజికవర్గం నుంచి విజయం సాధించారామె. అప్పటికే అక్కడ కీలక నేతగా ఉన్న మర్రి రాజశేఖర్‌ను కాదని విడుదల రజనికి టిక్కెట్ కేటాయించారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద ఆమె ఘన విజయం సాధించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో.. విడుదల రజని పార్టీలో యమ యాక్టివ్‌గా మారారు.

కరోనా సమయంలో అయితే విడుదల రజని చేసిన హంగామా అంత ఇంత కాదు. కరోనాతో కష్టల్లో ఉన్న ప్రజలను తానే సొంతంగా ఆదుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా విడుదల రజని చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాను చేసిన ప్రతి పనిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటారామె. అయితే ఆ మధ్య మంత్రి పదవి కోసం బాగానే ప్రయత్నాలు చేశారు విడుదల రజని. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. పలు వార్త ఛానెల్స్ కూడా విడుదల రజనికి మంత్రి పదవి అని బ్రేకింగ్‌లు వేసి అదరగొట్టాయి. కాని ఆమెకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలవడం కూడా విడుదల రజని ప్రతికూలంగా మారింది.

ఇక తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలు ఆమె మంత్రి పదవి ఆశలకు గండికొట్టినట్లుగానే కనిపిస్తుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట వైసీపీ చాలా బలంగానే ఉంది. అయినప్పటికి కూడా అక్కడ వైసీపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. రాష్ట్రం అంత కూడా వైసీపీ హావా కనిపించిన .. చిలకలూరిపేట నియోజికవర్గంలో మాత్రం టీడీపీ కూడా వైసీపీతో సమానంగా పంచాయితీలను గెలుచుకోవడం విశేషం. చిలకలూరిపేట నియోజికవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. నియోజికవర్గంలో మొత్తం 51 పంచాయితీలు ఉన్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రత్తిపాటి పుల్లరావు… పెద్దగా యాక్టివ్‌గా లేరు. దీంతో చిలకలూరిపేటలో విడుదల రజని క్లీన్‌స్వీప్ చేస్తుందని అందరు భావించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి విడుదల రజని చేతులెత్తిసినట్లుగానే కనిపిస్తుంది. 12 గ్రామాలు ఏకగ్రీవం కాగా ..మిగిలిన గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 19 పంచాయితీలను గెలుచుకోగా.. టీడీపీ 18 , సీపీఐ పార్టీ గెలుచుకున్నాయి. అంటే సగం పంచాయితీలలో ప్రత్యర్థులే గెలిచారు. దీంతో విడుదల రజని హవాకు పంచాయితీ ఎన్నికలు బ్రేకులు వేశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విడుదల రజని.. సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు.

పైగా కుప్పం , హిందుపురం వంటి కష్టమైన చోట్ల కూడా పార్టీ విజయం సాధించి… చూపించింది. కాని అన్ని రకాలుగా బలంగా ఉన్న చిలకలూరిపేటలో మాత్రం వైసీపీ తక్కువ సీట్లు గెలవడంపై.. పార్టీ అధినేత కూడా కాస్తా సీరియస్ అయినట్లు సమాచారం. మొత్తనికి పంచాయితీ ఎన్నికలు విడుదల రజనికి షాక్ ఇచ్చేయనే చెప్పాలి.