అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితో మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సడన్‌గా ఆ పర్యటన రద్దు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. అయితే.. సడన్‌గా పర్యటన ఎందుకు వాయిదా పడింది..? అపాయింట్మెంట్లు ఏమైనా రద్దయ్యాయా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనే విషయం తెలియాల్సి ఉంది.