వైఎస్ షర్మిల కొత్తపార్టీ ఏర్పాటుపై ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా ఆమె తన కొత్తపార్టీని స్థాపించనున్నారు. వైఎస్ఆర్‌పై అభిమానమే ఆస్థిగా భావించి ఆమె కొత్తపార్టీపై ముందుకు వెళ్తున్నారు. మొదట జగనన్న ఆశ్సీస్సులతోనే పార్టీ పెట్టాలని భావించినప్పటికి… ఆయనతో విభేదాలు రావడంతో కొత్తపార్టీ ఏర్పాటుపై దూకుడుగా ముందుకువెళ్తున్నారు షర్మిల. మరి దూకుడు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు పెద్దగా రాజకీయాల్లో పెద్దగా రాణించింది లేదు. గతంలో వైఎస్ఆర్ ఉన్న సమయంలో మాత్రమే అత్యధిక సంఖ్యలో మహిళలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేశారు.

తాజాగా మళ్లీ జగన్ ప్రభుత్వంలోనే మహిళలు ఎమ్మెల్యేలుగా, మంత్రులు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కొత్తపార్టీ ఎంతమేర రాణిస్తారో చూడాలి. కొత్తపార్టీ ఏర్పాటులో భాగంగా షర్మిల పలు జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో, నాయకులతో వరుస భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ జిల్లా నాయకులతో భేటీ అయి కొత్తపార్టీ ఏర్పాటుపై వారితో చర్చించి వారి నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల స్థానికత గురించే అందురు ఎక్కువుగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై స్పదించిన షర్మిల.. తాను తెలంగాణ కోడలినని చెప్పుకొచ్చారు. అలా అయితే కేసీఆర్ , విజయశాంతి వంటి వారు తెలంగాణ వాళ్లే కాదని ఆమె ఎదురు ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్నలు ఇప్పటి నుంచో మొదలైయ్యాయి. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికి కూడా షర్మిల పోటీ గురించి చాలానే చర్చలు సాగుతున్నాయి. అయితే ఆమె వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువుగా కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అదేవిధాంగా జగన్‌కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. పైగా 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ హవా కనిపించిన్పపటికి కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం వైసీపీనే మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.

ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపించగలిగింది. వైసీపీ తరుఫున షర్మిలనే ప్రచారం చేశారు. దీంతో అక్కడ ఆమెకు మంచి పట్టుంది. ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటారు. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేయాలని వైఎస్ షర్మిల దాదాపుగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం నేతలతో షర్మిల ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిందని తెలుస్తోంది.అక్కడ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి షర్మిల ఖమ్మం జిల్లాలో ఏ నియోజికవర్గం నుంచి పోటీ చేస్తారో చూడాలి.