మెగాస్టార్ చిరంజీవి మరోసారి కేంద్రమంత్రిగా కనిపించనున్నారు. అవును మీరు వింటుంది నిజమే మెగాస్గార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎన్నిక
కానున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే … మెగాస్గార్ చిరంజీవి 2009లో ప్రజరాజ్యం పేరిట ఓ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి అందరికి తెలిసిన
విషయమే. కాని ఆ ఎన్నికల్లో సర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ చాణిక్యత ముందు మెగాస్గార్ మ్యానియా ఏం పని చేయలేదు. అప్పుడు
జరిగిన ఎన్నికల్లో చిరంజీవి కేవలం 18 సీట్లకే పరిమితం అయ్యారు. ఆ తరువాత చిరంజీవిని కాంగ్రెస్‌లోకి తీసుకువద్దామని ప్రయత్నించారు వైఎస్‌ఆర్. కాని
ఈ సమయంలోనే వైఎస్‌ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. తరువాత జరిగిన పరిణమాలతో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో తన ప్రజరాజ్యం పార్టీని
విలీనం చేశారు. దీని ఫలితంగానే ఆయన రాజ్యసభ ఎన్నికై , కేంద్రమంత్రిగా పని చేశారు. కాని 2014లో సీన్ పూర్తిగా మారిపోయింది. జగన్ కాంగ్రెస్ పార్టీని
వీడటం, నేషనల్ లేవల్లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గడంతో నెమ్మదిగా రాజకీయాలకు దూరం అయ్యారు చిరంజీవి.

అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి , ఆయనకు మద్దుతుగా నిలుస్తున్నారు మెగాస్గార్. జగన్ సీఎం అయిన తరువాత
ఆయన ఇంటికి వెళ్లి మరి అభినందించారు చిరంజీవి. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే సత్తా జగన్‌కు మాత్రమే ఉందని మీడియా సముఖంగా తెలిపారు.
ఇక జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో పాటు, శాసన మండలి రద్దు విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమర్దించారు
చిరంజీవి. ఇలా తనకు అన్ని విధాలుగా మద్దుతుగా నిలుస్తున్న చిరంజీవికి ఏదో విధాంగా సాయం చేయలని ఫిక్స్ అయ్యారట ఏపీ ముఖ్యమంత్రి జగన్.
వచ్చే నెలలో కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిల్లో వైసీపీ 6 నుంచి 8 స్థానాలు వరకు దక్కే అవకాశం ఉంది.

ఇప్పటికే వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రతినిధ్యం వహిస్తున్నారు విజయసాయి రెడ్డి. వీరితో పాటు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉమ్మరెడ్డి వెంకటేశర్వరెడ్డి,
అయోద్య రామిరెడ్డి, బీద వంటి వారు రాజ్యసభకు ఎన్నిక కానున్నారని సమాచారం అందుతోంది. వీరితో పాటు మెగాస్గార్ చిరంజీవిని కూడా రాజ్యసభకు
పంపించాలని చూస్తున్నారట జగన్. తనకు అన్ని విధాల మద్దతుగా నిలుస్తున్న చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి న్యాయం చేయలని జగన్
ఆలోచిస్తున్నారట. ఇప్పటికే చిరంజీవి రాజ్యసభ సీటు గురించి పార్టీలో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారట జగన్. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల
ఇటు ఫిలిం ఇండస్ట్రీని దగ్గర చేసుకునే పనిలో పడ్డారు జగన్. పనిలో పనిగా పవన్‌కు కూడా చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు జగన్. ఇక చిరంజీవికి
రాజ్యసభ ఇస్తే కాపులకు కూడా న్యాయం జరిగినట్లు అవుతుందని జగన్ ఆలోచిస్తున్నారట.

ఇక వైసీపీ కేంద్ర క్యాబినెట్‌లో చేరితో చిరంజీవికి మరోసారి కేంద్రమంత్రి పదవి కూడా ఖచ్చితంగా లభిస్తోందని చెబుతున్నారు వైసీపీ నాయకులు. మరి కేంద్ర
క్యాబినెట్‌లో వైసీపీ చేరుతుందో చూడాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. వైసీపీ నుంచి వచ్చిన రాజ్యసభ ఆఫర్‌పై చిరంజీవి ఎలా స్పందిస్తారో
చూడాలి.