వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడాన్ని చంద్రబాబు, బాధా కృష్ణ తట్టుకోలేకపోతున్నారు. ఏడాది కాలంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బాధా కృష్ణ సహా ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్చ్‌…కుదరడం లేదు. ఎల్లో మీడియాలో చర్చల పేరుతో రచ్చ చేసినా ప్రజలు పచ్చ బ్యాచ్‌ మాటలు పరిగణనలొకి తీసుకోవడం లేదు. ఎల్లో మీడియా అంటేనే చంద్రబాబు వాయిస్ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇక..బాధా కృష్ణ చంద్రబాబు సొంత మనిషి అనుకుంటారు కానీ..జర్నలిస్ట్ అని ఎవరూ అనుకోరు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టడం ఎలాగో బాధా కృష్ణకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తన కలాన్ని, కులాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి వేల కోట్లకు పడగలెత్తిన ఘనుడు బాధా కృష్ణ. నిజమైన క్విడ్ ప్రొకో చంద్రబాబు, బాధా కృష్టల మధ్యనే జరిగింది.నేను నీకు ఇది రాస్తా, నాకు ఇది మీరు చేసి పెట్టాలి అనే వ్యాపారం దశాబ్దాలుగా చంద్రబాబు, బాధా కృష్ణల మధ్యనే జరిగింది. చంద్రబాబు నాయుడు 2014 -19 మధ్య సీఎంగా ఉండగా బాధా కృష్ణ మీడియాకు ఎన్ని వందల కోట్లు అడ్వటైజ్‌ మెంట్లు ఇచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే…అడ్వటైజ్‌మెంట్లుకు ఇచ్చిన దబ్బులు అన్నీ కూడా ప్రజల సొమ్ము . దీనిపై ప్రశ్నించే హక్కు ఐదు కోట్ల ఆంధ్రులకు ఉంటుంది.అలానే..బాధా కృష్ణ స్థిర,చరా స్థులపై కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విచారణ జరిపించాలి.బాధా కృష్ణ జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఆస్తులు ఎన్ని? ఇప్పుడు బాధా కృష్ణ ఆస్తులు ఎన్ని?. ఎలా సంపాదించారు. సొంత మీడియా పెట్టక ముందు ఆ స్తులు ఎన్ని?. పెట్టిన తరువాత ఆస్తులు ఎన్ని?. దీనిపై కూడా విచారణ జరిపించాలి. తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటి క్విడ్ ప్రొకో చంద్రబాబు – బాధా కృష్ణలతోనే మొదలయ్యింది. ఈ బాధా కృష్ణ క్విడ్ ప్రొకో మీద చిలుక పలుకులు పలుకుతున్నారు. గురివింద గింజ తన కింద ఉన్న నలుపును చూస్కోదట..!. బాధ కృష్ణ రాతలు కూడా గురివింద గింజలాగానే ఉన్నాయి. 2014 -19 నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్నారు.

మొదట్లో మోదీతో బాగా క్లోజ్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నిజంగానే క్విడ్ ప్రొకోకు పాల్పడితే అధికారంలో ఉన్న మీరు ఏం చేశారు?. ఆ సమయంలో విచారణ చేపట్టే అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా?. చంద్రబాబు నాయుడు 2014 -19 మధ్య కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి వైఎస్‌ జగన్‌ మీద అవినీతి కేసులు పెట్టాలని, జైల్లో పెట్టాలని మోదీని బతిమిలాడుకున్నది నిజం కాదా?. పరిణితి చెందిన, నిఖార్సైన రాజకీయ నాయకుడు ఎవరూ అనవసరంగా మరో నేతను ఇబ్బంది పెట్టాలని చూడరు. అందరూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంలా ఉండరు అనే విషయాన్ని చంద్రబాబు – బాధా కృష్ణ గుర్తు పెట్టుకోవాలి.

ఏడాది పాటు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లో మీడియా సహయంతో విషం చిమ్మారు. కానీ.. ప్రయోజనం లేదు. అసంతృప్తిని రాజేయాలని చూశారు కానీ..ప్రయోజనం లేదు. అమిత్ షా అపాయింట్‌మెంట్ గురించి బాధా కృష్ణ రాసిన రాతలు చాలా నవ్వు తెప్పించేలా ఉన్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ అమిత్ షా ఎందుకు తిరస్కరించారని రాజకీయ విశ్లేషకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట..!!. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఎల్లో గ్యాంగే కదా?!. ఎల్లో గ్యాంగ్ విశ్లేషకులు మాత్రమే బుర్రలు బద్దలు కొట్టుకుంటారు ఎందుకంటే..అపాయింట్‌మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందనే దానిపై అబద్దాలు అల్లాలి కదా?. నిసర్గ్ తుఫాను తీరం దాటి గుజరాత్, మహారాష్ట్రల్లో బీభత్సం సృష్టించే అవకాశముండటంతో అమిత్ షా అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎల్లో గ్యాంగ్ కూస్తున్నట్లు ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదులతో కాదు. ఈ విషయం బాధా కృష్ణకు కూడా తెలుసు. కానీ ..చంద్రబాబును సంతృప్తి పర్చడానికి ఏదో కథ అల్లాలి, జర్నలిజం విలువలను పాతరేయాలి కదా?!!.

టీడీపీలో అసంతృప్తిని, వారి ఎమ్మెల్యేల జంపింగ్‌లను ఆపడానికి బాధా కృష్ణ తన అక్షరాలను అడ్డు పెడుతున్నట్లు కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చిటికేస్తే వైఎస్‌ఆర్‌ సీపీలోకి రావడానికి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారు. ఇద్దరూ ఎమ్మెల్యేలు చేరిపోతున్నారంటూ ఎలక్ట్రానిక్ మీడియా బ్రేకింగ్‌లు వేసి నడిపింది. ఇదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోవడం ఖాయం. దీంతో…చంద్రబాబు హడావిడిగా విశాఖ పోతున్నానంటూ పర్మిషన్ తీసుకుని కరకట్టకు చేరుకున్నారు.టీడీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలతో బేరాలు చేశారు. తన ఎమ్మెల్యేలతో కూడా బేరాలు చేసిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతారు. తలా రూ.50 కోట్లు ఇస్తానని బేరమాడి, ఒప్పించి, మహనాడును తూతూ మంత్రంగా నడిపి మళ్లీ హైదరాబాద్ చెక్కేశారు చంద్రబాబు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో బేరమాడింది బాధా కృష్ణ చెత్తపలుకులో కనిపించదు. టీడీపీలో నేతలు, ఎమ్మెల్యేలు అసంతృ ప్తిగా ఉన్నారనేది బాధా కృష్ణ కలం రాయదు. కాని..ఇవన్నీ ప్రజలకు కనబడకుండా చేయడానికి వైఎస్ఆర్‌ సీపీలో అసంతృప్తి ఉందని రాస్తారు బాధా కృష్ణ. మాటికొస్తే విజయసాయి రెడ్డిని ముందు పెట్టి సీఎం వైఎస్‌ జగన్‌కు, విజయసాయికి భేదాలు ఉన్నాయని రాస్తారు. ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా?. చంద్రబాబు , లోకేష్‌ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. చంద్రబాబును లోకేష్‌ నోటికొచ్చినట్లు తిడతాడని కూడా టీడీపీ శ్రేణులే చెప్పుకుంటాయి. మరీ..మీ చెత్తపలుకులో నిజలైనా ఇవి రాయకుండా, అబద్దమైన విజయసాయి – జగన్ భేదాభి ప్రాయాలు ఉన్నాయని ఎందుకు రా స్తున్నారు. బాధా కృష్ణ గారు మీరు టీడీపీని కాపాడుకోండి. మాకు అభ్యంతరంలేదు. ప్రజల నమ్మకాన్ని గెల్చుకుని చంద్రబాబును నిలబెట్టుకోండి. అబద్దపు రాతలతో ప్రజలను మభ్యపెట్టి టీడీపీని బతికించుకోవాలని చూడొద్దు.

అధికారపార్టీ శాసనసభ్యుల కంటే ఎంపీలు ఎక్కువ అసంతృప్తితో ఉన్నారట..!!. ఎంపీలు వచ్చి బాధా కృష్ణ చెవిలో రహస్యంగా చెప్పారు తాము అసంతృప్తిగా ఉన్నామని రాయడానికి సిగ్గుశరం ఉండాలి. బాధా కృష్ణ ఎంతగా దిగజారిపోయి రాస్తున్నారంటే రాజకీయంగా సిగ్గుశరం వదిలేసుకుని, జర్నలిజం చనిపోయినా ఫర్వాలేదు టీడీపీని బతికించుకోవడానికి అక్షరాలను ఫణంగా పెడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో బీజేపీకి అవగాహన ఉంటుందట..!. బాధా కృష్ణ మీ రాతలు చదివితే శకుని కూడా ఉరి వేసుకుని చనిపోతాడు. ఇక్కడ బాధా కృష్ణకు హనుమాన్‌ చౌదరి మాటలు గుర్తు చేస్తాను. హనుమాన్ చౌదరి చంద్రబాబు మాజీ ఐటీ సలహాదారు. పాపం..చంద్రబాబు అధికారం కోల్పోవడం, వైఎస్‌ జగన్‌ స్పీడ్ చూసి చౌదరి కులస్థులు అందరూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్‌లో కమ్మ కులస్థుల రాయబారిగా హనుమాన్‌ చౌదరిని ఎన్నుకుని ఢిల్లీ పంపారు. హనుమాన్‌ చౌదరికి కమ్మ పెద్దలు ఇచ్చిన టాస్క్‌ ఏమంటే..చంద్రబాబును బీజేపీకి దగ్గరయ్యేలా మార్గం వెతకడం, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరపడం. అయితే..ఢిల్లీలో హనుమాన్‌ చౌదరిని చూడగానే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలను సీన్ అర్ధమయ్యింది. ఛీఛీ చంద్రబాబు నాయుడా విలువలు లేనివాడు, రాజకీయ దళారీ ఆయనతో కలిసే ప్రసక్తేలేదని తిట్టి హనుమాన్‌ చౌదరికి నాలుగు పెట్టి పంపారు. అందుకే…హనుమాన్‌ చౌదరి హైదరాబాద్ రాగానే బాబు నీకు రాజకీయాలు వద్దు మానుకో అంటూ లేఖ రాశారు. దీని గురించి బాధా కృష్ణ రాయరు. దీనిని కప్పిపుచ్చడానికి వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల్లో అసంతృప్తి ఉంది. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అవగాహన ఉంటుందని చెత్త పలుకులో చెత్త రాతలు రాస్తారు బాధా కృష్ణ. బాధా కృష్ణ – చంద్రబాబుల కుయుక్తుల వలలో పడటానికి ఎవరూ సిద్దంగా లేరు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు తట్టాబుట్టా సర్ధుకోవడం ఖాయం. ఇంకో ఏడాది న్నర తరువాత కూడా వైఎస్‌ జగన్‌ 90 శాతం మంత్రులను మార్చినా మీరు వార్తలు వండుకోవడం తప్పితే అసంతృప్తి ఏం ఉండదు..?!!.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలనలోనే తానేంటో నిరూపించుకున్నారు. ఎక్కడా కూడా అవినీతి అనే మాట వినపడకుండా పాలన సాగిస్తున్నారు. ఇది చంద్రబాబు – బాధా కృష్ణలకు రుచించడం లేదు. ఎందుకంటే వీరిద్దరూ అవినీతిపుత్రులు కదా?!!. అవినీతి అనే మాట వినకపోయినా, అవినీతి చేయకపోయినా ఆ రోజు వీరిద్దరికీ ముద్ద దిగదు. 2014 -19 మధ్యలో చంద్రబాబు రెండున్నరల లక్షల కోట్లపైగా అప్పుల చేశారు.తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి రూ.60వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉంచారు. ఇంకా చాలా చెల్లించని బిల్లులను కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టి వెళ్లారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందు కూడా చంద్రబాబు రూ.5వేల కోట్ల అప్పు తెచ్చారు. 2014,మే23న చంద్రబాబు ఓడిపోయారు. మే30న జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసే సమయానికి ఏపీ ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంతకు రెండు వారాల ముందు అప్పు చేసి తెచ్చిన రూ.5 వేల కోట్లు ఏమయ్యాయి?!!. అంతే కాదు..2019, జూన్‌ ఖర్చులు పోవాలంటే రూ.5వేల కోట్లు కావాలి. రూ.100 కోట్ల ఖజానా నుంచి ఈ రోజున సంక్షేమ పథకాలను ఢోకాలేని ఖజానాగా ఏపీని మార్చారు సీఎం వైఎస్‌ జగన్‌. చేయాల్సిన అప్పులన్నీ మేమే చేశాం, ఇక జగన్‌ చేయడానికి ఏం లేదని యనమల ప్రకటించడం రాక్షసానందానికి నిదర్శనం.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై పడి బాధా కృష్ణ ఏడుస్తున్నాడు. బాధా కృష్ణ రాతలు ఉన్నతాధికారులను బెదిరించేలానే ఉన్నాయి. ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులు చాలా ప్రశాంతంగా తమ బాధ్యతలు, విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా అధికారులపై ఒత్తిడి లేదు. ఢిల్లీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాబీల్లో జగన్‌ పాలన గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఏడాదిలోనే ఇలా ఉన్నతాధికారుల ప్రశంసలు అనేవి ఏ ప్రభుత్వానికైనా మంచి శకునాలు పంపుతాయి. చంద్రబాబు పాలనలో మేం ఏపీలో పని చేయం, దయచేసి మమ్మల్ని కేంద్ర విధుల్లోకి తీసుకోండని ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కేంద్రానికి లేఖలు రాసుకున్నారు. ఈ రోజున ఏపీలో ఈ పరిస్థితిలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పని చేయాలని చాలా మంది ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. అధికారులు మొదట చాలా బాగుంటారు, తరువాత అవినీతి పరులు అవుతారని బాధా కృష్ణ రాశారు. దేశంలో బాబుగారు కంటే అవినీతి పరులు ఎవరైనా ఉన్నారా ?.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం బాధా కృష్ణకు ఉందా?..

బాధా కృష్ణ రాతలు చంద్రబాబులోని అసహనాన్ని చూపిస్తున్నాయి. ఆనం, ధర్మాన ఎప్పుడు పార్టీలోకి వచ్చారు. ఎన్నికలకు కాస్త ముందు వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చారు. వారు ఎంత సీనియర్లు అయినప్పటికీ పార్టీలోకి వచ్చిన కొన్ని నెలలకే మంత్రి పదవులు ఎలా వస్తాయి?!!. బొత్స వీరికంటే ముందు వచ్చారు. వైఎస్‌ఆర్‌ సీపీ కోసం కష్టపడ్డారు . మంత్రి పదవి వచ్చింది. బొత్సకు మంత్రి పదవి ఇచ్చారు. ఆనంకు, ధర్మానాకు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న రాజకీయంగా అర్ధంలేనిది. ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి వచ్చింది. ఆయన మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ను నమ్ముకుని ఉన్నారు. ధర్మాన అలా లేరు కదా?. అయితే..వైఎస్ఆర్‌ సీపీ సీనియర్లను అగౌరవించదు. వారి సేవలను ఎలా వాడుకోవాలో వైఎస్‌ జగన్‌కు తెలుసు. ఆనం రామనారాయణ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వైఎస్‌ జగన్‌ పాలనా ఫలాలు ప్రచారం చేయడంలో ఆనం డిజిటల్ మీడియాలో ముందుంటున్నారు. అలానే ధర్మాన ప్రసాద రావు కూడా పరిస్థితులను గమనించి, ఆకలింపు చేసుకుని ముందుకు వెళ్తుంటారు. ఈ మాత్రానికే సీనియర్లు అసంతృ ప్తితో ఉన్నారు అని రాయడం ఏ జర్నలిజం కిందకు వస్తది..?. బాధాకృష్ణ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? . ఇప్పటికైనా చంద్రబాబు – బాధా కృష్ణ ప్రజల కోసం రాజకీయం చేయడం నేర్చుకోవాలి..!. మీ కోసం రాజకీయాలు చేస్తూ కూర్చుంటే మీకంటూ ఎవరూ మిగలరు..?!!!.