జగన్ సీఎం అయిన దగ్గన నుంచి పెట్టుబడులు పెట్టే కంపెనీలు అన్ని రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నాయాని తెగ ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. జగన్‌ను చూసి పెట్టుబడులు పెట్టాడానికి ఏ కంపెనీలు కూడా ముందుకు రావడం లేదని ఎల్లో మీడియా కూడా బాగానే ప్రచారం చేస్తున్నాయి. వీరిందరికి గట్టి షాకిచ్చింది జగన్ సర్కార్. దేశంలో పెట్టుబడులు పెట్టాడానికి అనువైన రాష్ట్రంగా ఏపీ ఆగ్రస్థానంలో నిలిచింది. అవునండీ.. ఇండియాలోనే పెట్టుబడులు పెట్టడానికి ఏపీ చాలా అనుకూలంగా ఉందని తాజాగా చేయించిన సర్వేలో వెల్లడైంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఇన్వెస్ట్ ఇండియా చేయించిన సర్వేలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. గతంలో తెలంగాణతో పాటు మొదటిస్ధానాన్ని పంచుకున్న ఏపీ , ఇప్పుడు ఏకంగా సింగిల్‌గానే మొదటిస్థానంలో నిలిచి అందరికి షాకిచ్చింది. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అత్యంత అనువైనదని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. ఈ సర్వేలో చాలా అంశాలనే పరిగణలోకి తీసుకున్నట్లూ తెలుస్తోంది. ఏపీలో క్రియాశీలకంగా ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు, లాజిస్టిక్స్, పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడానికి అనువైన రవాణా సౌకర్యాలు, పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి భూములు అందుబాటులో ఉండటం, పారిశ్రామిక ప్రాంతాలతో పాటు వాటికి కల్పించిన మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే పారిశ్రామిక విధానం.. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్ ఇండియా ఏపీని పెట్టుబడులను పెట్టడానికి అత్యంత అనువైన రాష్ట్రంగా గుర్తించింది.

ఏపీలో ఉన్న విమానాశ్రయాలు రవాణకు చాలా ఉపయోగపడతాయి. గన్నవరం, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నట్లు వెల్లడించింది. రాజమహేంద్రవరం, కడప, పుట్టపర్తిల్లో విమానాశ్రయాలు డొమెస్టిక్‌గా వినియోగిస్తోందని పేర్కొంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ ఓడరేవులతో పాటు దేశంలోనే అతి పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని ఏపీ రాష్ట్రం కలిగి ఉందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. వేరే రాష్టాలకు సరకును తరలించాలన్న, వేరే దేశాల నుంచి ఉత్పత్తులు రప్పించాలన్న ఈ ఓడరేవులు బాగా ఉపయోగపడతాయి అని ఇన్వెస్ట్ ఇండియా తెలిపింది, పైగా రాష్ట్ర ప్రభుత్వం కల్సిస్తున్న ప్రత్యేక రాయితీలు కూడా ఏపీని ఆగ్ర స్థానంలో నిలిపాయి. ఏపీని ఆగ్ర స్థానంలో నిలపడం వెనక సీఎం జగన్ కష్టం చాలా ఉంది. పలు కంపెనీలకు ప్రత్యేక వసతులు కల్పించి వాటిని ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేశారు జగన్ . ఇప్పుడు వాటివల్లే ఇప్పు ఏపీలో పెట్టుబడులు పెట్టాడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.