టీడీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సార్వతిక ఎన్నికలతో పాటు, ఇటీవలే జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా టీడీపీ దారుణ ఓటమిని చవిచూసింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నప్పకి కూడా టీడీపీ బలం పుంజుకోలేకపోయింది. పైగా ఈ రెండేళ్లతో వైసీపీ మరింత బలపడింది. ఈ సమయంలోనే కీలక నేతలు టీడీపీని వదిలిపెట్టేయడం కూడా ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇవి చాలవు అన్నట్లు వరుస ఎన్నికలు టీడీపీని వెంటాడుతున్నాయి. పంచాయితీ ఎన్నికలు కావాలి అని పట్టబట్టి మరి ఎన్నికలకు వెళ్లిన టీడీపీ, తీరా ఎన్నికలు వచ్చే సరికి వైసీపీకి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

పంచాయితీ ఎన్నికలు ఏకపక్షంగానే జరిగినట్లు స్పష్టం అయింది. ప్రస్తుతం కార్పోరేషన్ ఎన్నికలపై అధికార పార్టీ దృష్టి పెడితే టీడీపీ మాత్రం అభ్యర్థులను వెతుకునే పనిలో పడింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోవు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అని క్యాడరే చర్చించుకోవడం విశేషం. ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అనేది తెలియాలి అంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.

వైజాగ్‌లో టీడీపీ మొదటి నుంచి బలంగానే ఉంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైజాగ్‌లో ఫ్యాన్ గాలి కనిపించింది. జిల్లాలో కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది టీడీపీ. వైజాగ్‌ను పరిపాలన రాజధానికగా ప్రకటించి వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బకొట్టారు సీఎం జగన్. టీడీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే జగన్‌కు జై కొట్టారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇప్పటికే జగన్‌కు జై కొట్టారు. మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.

ఇక తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే గణబాబు గత కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పైగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా ఆయన యాక్టివ్‌గా లేరని పార్టీ కార్యకర్తలే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. గణబాబు మారేందుకు ఇలా చేస్తున్నారని నియోజికవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. గణబాబు కూడా వైసీపీ గూటికి చేరితే జిల్లా టీడీపీలో ఒక్క వెలగపూడి ఒక్కరే మిగులుతారు. మరి గణబాబు వైసీపీకి మద్దతిస్తారో లేదో చూడాలి.