ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలిపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. నిమ్మగడ్డ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ కూడా శాశించే స్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని తీవ్ర అసహనంతో ఉన్న ఏపీ ప్రభుత్వ పెద్దలు గవర్నర్ భిశ్వభూషణ్ శాసించే స్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని తీవ్ర అసహనంతో వైసీపీ నేతలు నిమ్మగడ్డపై గరవ్నరుకు ఫిర్యాదు చేయాలనుకుంటన్నారు.

మరోపక్క జగనుకు క్లోజ్గా ఉన్న సర్కిల్ ను టార్గెట్ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత రెండు రోజులుగా లేఖ అస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికలకు సహకరించడం లేదని.. హైకోర్టులో ధిక్కరణ పిటిషను దాఖలు చేశారు. ఈ అంశం జగన్ సర్కారుకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో నిమ్మగడ్డపై రివర్స్ ఎటాక్ చేయడానికి ప్లాన్ బీ సిద్ధం చేసుకుంటున్నారు.. వైసీపీ నేతలు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులుగా కీలక భూమిక పోషిస్తున్న జగన్ కు క్లోజ్ గా ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్య నేతలను నిమ్మగడ్డ టార్గెట్ చేస్తున్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలిపై గవర్నరుకు ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ పరిధిని నిర్ధారించాలని, తనకు సంబంధం లేని ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. అలాగే ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

చీఫ్ సెక్రటరీ ఆధిత్యానాధ్, పంచాయతీ సెక్రటరీ గోపాలకృష్ణ త్రివేది.. సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులను టార్గెట్ చేస్తూ.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నరుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అంశం ప్రభుత్వ పెద్దలకు నచ్చడం లేదు. దీనిపై జగన్ సర్కారు గుర్రుమంటోంది. తమపై వరుస ఫిర్యాదుల దాడి చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహార శైలిపై ఎదరుదాడికి జగన్ సర్కారు రెడీ అవుతోంది. అంతేకాదు పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడం పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అన్న ఆగ్రహంతో వైసీపీ నేతలు ఉన్నారు. పక్షపాత ధోరణితో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని భావిస్తూ.. గవర్నరుకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ నిమ్మగడ్డ రమేశ్ కుమారుకు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ముందు.. ముందు ఎలా ఉంటుందో చూడాలి.