వైఎస్ జగన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.. చాలా తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. ఇక తండ్రి మరణంతో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఎప్పుడు ప్రజల సమస్యలపై.. పోరాడుతూ.. రాజకీయంగా చాలా బిజీగా ఉండే జగన్.. తాను తినే తిండి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా అశ్రద్దగా ఉండడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రతి రోజు ఒకే మెనూతో జగన్ ఆహారం తీసుకుంటాడు. ఆయన ఆహారపు అలవాటు కారణంగానే ఆరోగ్యంగా ఉంటాడేమో అనిపిస్తుంది. దేశంలోనే ఇప్పుడు ఆయన స్మార్ట్ సీఎం. అతి పిన్న వయస్కుడు. రోజురోజుకు ఎంతో ఉత్సాహం.. ఉరిమే వేగంతో పనిచేస్తున్న సీఎం జగన్ ఏం తింటాడు? ఎలా ఇంత యాక్టివ్ గా ఉంటాడన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఒక హీరోలా కనిపించే జగన్ తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మానేశాడు. అందుకే ఇంత స్మార్ట్ గా ఉన్నారు. ఇంతకీ జగన్ ఏం తింటారో తెలుసుకుందాం..

వైఎస్ జగన్ ఉదయాన్నే4: 30 గంటలకు లేచి ఒక గంటపాటు వ్యాయామం చేసి, కాలకృత్యాల అనంతరం ఉదయం 7 గంటల వరకూ న్యూస్ పేపర్లు చదువుతారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చిస్తారు. తదుపరి ప్రజా సంకల్పయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తెలుసుకుంటారు. కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే యాత్ర కొనసాగేలా చూస్తారు.

జనాలందరిలాగా జగన్ ఉదయాన్నే అల్పాహారం తీసుకోరు కేవలం ఒక్క గ్లాస్ జ్యూస్ మాత్రమే తీసుకుంటారు తదుపరి పనులు కొనసాగిస్తారు. అప్పుడప్పుడు రెండు ఇడ్ల్లు లేదా ఒక వడను టీఫిన్ గా తీసుకుంటాడట. ఇకా మద్యాహ్నం పులిహోర లేదా చెపాతీ తీసుకుంటాడట. పులిహోరలో ఖచ్చితంగా.. డ్రై ఫుడ్స్ ఉండేలా జగన్ చూసుకుంటాడు. సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాడట. ఇక రాత్రి సమయంలో పెరుగన్నం మరియు నాన్ వెజ్ తో రైస్ లేదా చెపాతి తింటాడట. నిద్రపోయేముందు కప్పు పాలు తాగుతారు.

వీటన్నిటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. అందుకేనేమో జగన్ అంత స్మార్ట్ కనపిస్తుంటారు. అయితే యాత్రలు, ప్రజా సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మాత్రం జగన్ ఏది దొరికితే అది తింటారు. సీఎం జగన్ కు బిర్యానీ అంటే చాలా ఇష్టమట.. ఆయన ప్రతీ ఆదివారం తన మెనూలో బిర్యానీ ఉండేలా చూసుకుంటారట.. ఇక మటన్ కీమా అంటే కూడా జగన్ ఇష్టంగా తింటారట.. అది కూడా ఆదివారం ఎలాంటి కండీషన్లు పెట్టుకోకుండా తింటారు. అప్పుడప్పుడు చేపలు కూడా తింటారట..

నైట్ ఎంత లేట్ గా పడుకున్న కుడా ఉదయాన్నే ఖచ్చితంగా 4: 30 నిమిస్గాలకు లేస్తారు. తెల్లటి చొక్కా, క్రీమ్‌ కలర్‌ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ధరించాక జగన్ సీఎంగా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. ఇది మరి జగన్ ఆహారపు అలవాట్లు.  ఇదే క్రమం తప్పకుండా తినడం వల్ల జగన్ ఎన్ని కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపినా కూడా అలసి పోకుండా ఉంటాడు.