ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ఉత్తమ స్థానంలో నిలిచారు. దేశంలో ఉత్తమ పాలన చేసిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అనతి కాలంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచి ప్రజానేతగా ఎదిగి ప్రజల్లో ఓ శక్తిమంతుడైన లీడర్ గా మారాడు వైఎస్ జగన్.

ముఖ్యంగా దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాప్ లో నిలిచారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే సినిమాల్లో క్లాస్.. మాస్ ప్రేక్షకాదరణ వలె ప్రజా సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా ఎంతో ఆదరణ పొందారు వైఎస్ జగన్. తాజాగా ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరుతో నేషనల్ లెవల్లో ఈ నెలలో ఓ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌ సర్వేలో వైఎస్‌ జగన్‌ ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ల లిస్ట్ లో నాలుగో స్థానాన్నికైవసం చేసుకున్నారు.
అయితే దేశం మొత్తం మీద మొదటి స్థానంలో బీజేపీ అధికారం ఉన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉండగా.. రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిలవగా.. మూడో స్థానంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఆయా స్థానాలను పొందారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ పరిపాలనా తీరుకు పలువురు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని నవరత్నాలు వంటి పలు పథకాలను.. అంశాలను వరుసగా ఆరు నెలల్లోనే అమలు చేయడం ఓ చరిత్రగా దేశం మొత్తం హర్షిస్తుంది. అదేవిధంగా దిశ, ఆంగ్లమీడియంలో విద్యాబోధన వంటి ఎన్నో కొత్త కొత్త చట్టాలను చేసి ఆదిశగా వెంటనే అమలు చేయడం కూడా ఏపీ రాష్ట్రప్రభుత్వం వడివడిగా చేస్తున్న పని తనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం, వైఎస్సార్‌ రైతు భరోసా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జగనన్న విద్యా దీవెన, హాస్టల్‌ ఖర్చులకు ఏటా రూ.20 వేలు ఇస్తూ.. జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను వినూత్నంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే కాకుండా పకడ్బంధీగా అమలు చేస్తుంది వైఎస్ జగన్ డైరెక్షన్ లోని వైసీపీ ప్రభుత్వం.

ఇంకా అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన సీఎం ఒక్క వైఎస్‌ జగన్‌ తప్ప దేశంలో మరొకరు మన కనపడరు. దేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల లిస్ట్ లో అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, ఆరో స్థానంలో గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు నిలిచారు. అయితే ఈ ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్‌ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్‌ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్‌ఫార్మెన్స్‌ ను పరిగణలోకి తీసుకున్నారు. ఏది ఏమైనా.. అనతి కాలంలోనే సరికొత్తరీతిలో సుపరిపాలన దిశగా వినూత్నంగా ప్రజాసంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా దూసుకుపోతూ దేశం గర్వించే స్థాయికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ గారికి ప్రజా చైతన్యం ఛానల్ తరఫున శుభాకాంక్షలు.