లవ్ ఎఫైర్స్, బ్రేకప్‌లు, లివింగ్ రిలేషన్‌షిప్స్ వంటివి మన తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించవు కాని, బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఇలాంటివి చాలా కామన్. అక్కడ పెళ్లైన వారితో కూడా రిలేషన్‌షిప్స్‌లో ఉంటుంటారు. ఇక పెళ్లి కాని వారి గురించి వేరేగా చెప్పాలా. తాజాగా మరో బాలీవుడ్ జంట కెమెరా కంటికి చిక్కారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ క్రికెటర్ ధోని బయోపిక్‌ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ధోని బయోపిక్‌లో నటించడం వల్ల మనోడు ఇండియా మొత్తం బాగానే ఫేమస్ అయ్యాడు.

కాని ఆ తరువాత అంతటి రేంజ్‌లో మళ్లీ మెప్పించలేకపోయాడు. ఇక మనోడికి ఎఫైర్స్ కూడా కాస్తా ఎక్కువే. మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కిడినే సినిమాలో హీరోయిన్‌గా నటించిన క‌ృతి సనన్‌తో కొంతకాలం ఎఫైర్ సాగించాడు సుశాంత్. వీరిద్దరి మధ్య రిలేషన్ కొన్నాళ్లు బాగానే నడిచింది. తరవాత ఏం జరిగిందో తెలియదు కాని వీరిద్దరు తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. తరవాత సుశాంత్ తన సినిమాలతో బిజీగా మారాడు. క‌ృతి సనన్‌ కూడా వరుస సినిమాలు చేస్తోంది. సుశాంత్ తాజాగా మరో భామతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సుశాంత్ ప్రస్తుతం రెహా చక్రవర్తితో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరు కూడా గత కొంతకాలం నుంచి ప్రపంచాన్ని చూట్టేస్తున్నారు. పబ్బులు , రెస్టారెంట్లు,అంటూ తెగ తిరిగేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని బాలీవుడ్ మీడియాలో కూడా అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరి బంధాన్ని దృవ పరిచే సంఘటన ఒకటి బయటికి వచ్చింది.

వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మధ్య రెహా చక్రవర్తిని పెద్దగా కలవలేదట సుశాంత్. దీంతో ఆమెను కలవడానికి షూటింగ్‌‌లకు కాస్తా బ్రేక్ ఇచ్చి మరి ఆమె ఇంటికి వెళ్లాడని తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో రెహా చక్రవర్తి ఇంటికి వెళ్లి మరి ఆమెను కలిశాడట సుశాంత్. చాలాసేపే ఆమెతో గడిపినట్లూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అతి త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. సుశాంత్ సినిమాల విషయానికి వస్తే వరుస హిట్లతో బాలీవుడ్‌‌లో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.

రెహా చక్రవర్తి విషయానికి వస్తే తెలుగులో తూనీగ తూనీగ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ భామ. అక్కడ కూడా పెద్దగా వర్క్‌అవుట్ కాకపోవడంతో చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. రెహా ప్రస్తుతం సుశాంత్‌తో ప్రేమలో మునిగితెలుతోంది. మరి వీరి రిలేషన్ పెళ్లి వరుకు వెళ్తుందో లేదో చూడాలి.