విజయవాడ : ఏపీలో మరో రాజకీయ వారసురాలు తెర మీదకు వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆమె విజయవాడ 11వ డివిజన్ నుంచి రంగంలోకి దింపింది టీడీపీ అధిష్టానం. రాబోవు కాలంలో విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూడా ఆమెను ప్రకటించారు కేశినేని. శ్వేత తన చదువులు మొత్తం విదేశాల్లోనే పూర్తి చేశారు. గత ఎన్నికల్లో తన తండ్రి కేశినేని తరుపున ప్రచారం కూడా నిర్వహించారు శ్వేత. విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని అతి తక్కువ మెజార్టీతో గెలవగలిగారు. టీడీపీ తరుపున నాని, వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేశారు. ఈ పోటీలో కేశినేని నాని అతి తక్కువ ఓట్లతో విజయం సాధించారు. రాష్ట్రం మొత్తం వైసీపీ తన హవాను చూపించినప్పటికీ విజయవాడ ఎంపీ సీటును మాత్రం గెలవలేకపోయింది. ఇక కేశినేని శ్వేత విషయానికి వస్తే …

ఆమెకు పెద్దగా రాజకీయాలు తెలియవు. తన తండ్రి నాని చాలా దగ్గర ఇప్పుడిప్పుడే నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని నిలవరించడానికి ఆఖరికి తన కూతురును రంగంలోకి దింపారు కేశినేని నాని. ఆమె చేత ఆర్భాటంగా నామినేషన్ కూడా వేయించారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కాని నాని రాంగ్ టైమ్‌లో రాంగ్ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా రాష్ట్రం అంతటా జగన్ హవా నడుస్తోంది. జగన్ చేస్తోన్న అభివ‌ృద్ది కార్యక్రమాలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలే , పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇటువంటి సమయంలో తన కూతురిని రాజకీయ ప్రవేశం చేయించి నాని తప్పు చేశారని వారు అంటున్నారు.

సాధారణంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీయే స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తోంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి , ఆ పార్టీకే విజయావకశాలు ఎక్కువుగా ఉంటాయి. పైగా జగన్ వంటి బలమైన నాయకుడు సమయంలో నాని ఇలా తన కూతురిని రంగంలోకి దించి ఉండాల్సింది కాదని చాలా మంది అభిప్రాయడపడుతున్నారు. కాని కేశినేని ఆలోచన వేరేలా ఉంది. తన కూతురు శ్వేత గెలిస్తే చంద్రబాబు ద‌ృష్టిలో తాను హీరోను అవుతానని ఆయన భావిస్తున్నారట. ఈ ఎన్నికల్లో గెలిస్తే తన కూతురుకు మేయర్‌ పదవి కూడా దక్కుతుందని అని ఆయన ఆశ పడుతున్నారు.

ఒకవేళ శ్వేత ఓడిపోయినప్పటికీ కూడా ఎటువంటి బాధ లేదట. పార్టీ కష్టకాలంలో తనతో పాటు తన కూతురు శ్వేత కూడా పార్టీకి అండగా నిలబడిందని సాకు చూపించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శ్వేతకు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించే ప్లాన్ చేస్తున్నారట కేశినేని. ఆయన ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి కాని అవి ఎంత వరకూ వర్క్‌అవుట్ అవుతాయో చూడాలి. విజయవాడలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను రెండు పార్టీలు కూడా ప్రతీష్టత్మకంగా తీసుకున్నాయి. ఒకవేళ కేశినేని శ్వేత గెలిస్తే కనుక ఆ జిల్లా మంత్రి పదవులు ఊడుతాయ్ అని ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీ చేశారట. మరి కేశినేని శ్వేత గెలిచి ఎవరి మంత్రి పదవులు ఉడగొడుతోందో, లేక ఆమెనే ఓడిపోతుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.