ఈ రోజు ఎంపీ నందిగం సురేష్ గారి పుట్టిన రోజు కేక్ కటింగ్ కి సీఎం జగన్ గారు పాల్గొన్నారు..  నిత్యం ఎంపీ నందిగం సురేష్ గారి లాంటి ఎంపీలు, ఏమ్మేల్లెల్లు సీఎం ని కలుస్తూ సోషల్ మీడియా లో ఫొటోస్ తో సహా సమావేశం వివరాలు షేర్ చేస్తూ ఉంటే ఒక్క రఘురామ కృష్ణం రాజు గారికి మాత్రమే దొరకడం లేదా సీఎం అప్పాయింట్మెంటు?

కొంచెం అన్నా డిప్లమసీ ఉండాలి..

నేను ఎంపీ అని రోడ్ మీద ఇష్టం వచ్చినట్లు కార్ నడిపితే ఆక్సిడెంట్ అవ్వుతుంది.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.. ఎక్కడైనా అంతే.. వ్యాపారంలో అయినా రాజాకీయాలలో అయినా.. ప్రతి చోటా రూల్స్ ఉంటాయి.. ప్రొటొకాల్స్ ఉంటాయి.. వాటిని ఎవరైనా పాటించాలి.. ఇంత అహంకారం, డబ్బు మదం పనికిరాదు.. పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నాళ్ళు కామ్ గా ఉండాలి అని తెలియని వయసు కాదు.. కానీ అర్ధం చేసుకోవడం లేదు అయన..

అయన ఎన్నికల ప్రచారంలో తాగి వాగాడని ఏబీఎన్, TV5 తదితర టీవీలు ప్రసారం చేస్తే తమ నియోజకవర్గం కానప్పటికీ, ఎన్నో మైళ్ళ దోరంలో ఉన్నప్పటికీ, కొన్ని లక్షల మంది వైస్సార్సీపీ అభిమానులు అయన ఓడిపోకూడదు గెలవాలి అని వేడుకున్నాం.. ఇప్పుడు అదే ఏబీఎన్, TV5 చానెల్స్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వచ్చే ఎన్నికలలో తన నియోజకవర్గంలో లక్షల కొద్దీ వైస్సార్సీపీ అభిమానులు నలుమూలల నుంచి వచ్చి తన ఓటమి కోసమే పనిచేసేలా ప్రేరేపణ పొందుతారు తన వగరుబోతు మాటలతో..

భార్యాభర్తలు గొడవ పడితే ఇంట్లో పరిష్కరించుకుంటే ఎంత మంచిగా ఉంటుందో.. రాజకీయాలలో కూడా అదే బాగుంటుందని ఆయనకి ఎవరైనా అర్ధమయ్యేలా చెబితే బాగుంటుంది..