టీడీపీ నుంచి మరో వికెట్ పడిపోయింది. అవును మీరు వింటుంది నిజమే. మరో ఎమ్మెల్యే టీడీపీ నుంచి అధికార వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం
చేసుకుంటున్నారు. అతి త్వరలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారనే వార్త బాగా వినిపిస్తోంది. ఇంతకి ఎవరా ఎమ్మెల్యే…? ఏంటా కథ తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో జగన్ గాలి బలంగా వీయడంతో అధికార టీడీపీ పార్టీ కేవలం 23 సీట్లలో మాత్రమే విజయం
సాధించింది. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేక చాలామంది నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
పార్టీని వీడి జగన్‌కు జై కొట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే. గుంటురుకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా జగన్ చేస్తున్న అభివృద్దిని ఆయనకు
మద్దుతునిచ్చారు. సెకండ్ గ్రేడ్ నాయకులు సైతం పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్న చంద్రబాబుకు షాక్
ఇవ్వాడానికి రెడీ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

ఆయన టీడీపీ పార్టీని వీడి అధికార వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో కూడా నిమ్మల
గెలిచారు. నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా , పాలకొల్లు నియోజిక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.మరోసారి టీడీపీ గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనుకున్నారు నిమ్మల రామానాయుడు. కాని ఎన్నికల ఫలితాలు ఆయనకు షాకిచ్చాయి. ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ప్రజలు తనను పట్టించుకోవడం లేదని తెగ బాధ పడిపోతున్నారట. ప్రతిపక్షంలో ఉండటంతో ప్రజలు కూడా తనను గుర్తించడం లేదని కార్యకర్తల దగ్గర వాపోతున్నారట. ప్రజలు అందరు పాలకొల్లు వైసీపీ ఇన్‌చార్జ్ వద్దకు వెళ్లి తమ పనులను చక్కపెట్టుకోవడంతో నిమ్మల చిన్నబోతున్నారట. ఇదే సమయంలో పార్టీతో పాటు, చంద్రబాబు కూడా తనను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ ఉన్నారట టీడీపీ ఎమ్మెల్యే.

పైగా రోజు రోజుకి రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మరి దారుణంగా తయ్యారు కావడంతో , చేసేది లేక ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని
తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్ హవా నడుస్తుండటం, చంద్రబాబు పని అయిపోవడంతో నిమ్మల రామానాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో వారంలో
ఆయన జగన్ కలిసి ఆయన సమక్షంలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరి ఆయన కనుక వైసీపీలో చేరితో తన పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మల తన పదవికి రాజీనామా చేస్తారో లేదో చూడాలి. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకనే టీడీపీ నాయకులు ఇలా వేరే పార్టీల్లో చేరడానికి రెడీ అవుతున్నారనేది మాత్రం అక్షర సత్యం.