ఏపీలో వైఎస్ జగన్ ఎటువంటి విజయం అయితే సాధించారో సరిగ్గా అలాంటి విజయం సాధించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ముచ్చటగా మూడోసారి
ఘన విజయం సాధించారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ విజయంలో జగన్ పాత్ర కూడా ఉంది, అది ఎలాగో ఓ సారి చూద్దాం. జగన్ ఎన్నికల సమయంలో
ఎటువంటి వ్యూహాలను రచించారో సరిగ్గా అలాంటి వ్యూహాలను పాటించారు కేజ్రీవాల్. ఏపీలో రైతులు ఎక్కువుగా ఉంటారు. వారికి తగినట్లూ మంచి పథకాలను ప్రవేశపెట్టారు జగన్. పైగా వారికి తగిన సదుపాయాలు కల్పిస్తామని రైతులకు భరోసా కల్పించారు. అన్ని వర్గాల ప్రజలకు నేను విన్నాను… నేనున్నాను అనే హామీని ఇచ్చి ఎలెక్షన్స్‌కు వెళ్లారు జగన్. అప్పటికే చంద్రబాబు పరిపాలనపై విసెగెత్తి ఉన్న ప్రజలకు జగన్ ఓ ఆశ దీపంలా కనిపించాడు. దీంతో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించింది. పైగా అప్పటి మీడియా మొత్తం టీడీపీకే అనుకూలంగా పని చేసింది.

దీంతో జగన్ గురించి మీడియాలో పెద్దగా చూపించేవారు కాదు. ఇటువంటి సమయంలోనే జగన్ సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్నారు. సరిగ్గా
ఇదే ప్రణళికను ఢిల్లీ ఎన్నికల్లో అమలు చేశారు కేజ్రీవాల్. అయితే ఏపీలో రైతులు ఎక్కువుగా ఉంటే , ఢిల్లీలో మాత్రం చదువుకున్న వారు ఎక్కువ. దీంతో
వారికి తగినట్లుగానే తన వ్యూహాలను మార్చుకున్నారు కేజ్రీవాల్. నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పించారు కేజ్రీవాల్. ఇక ఉద్యోగం చేసే మహిళలకు ప్రత్యేక
రాయితీలు కల్సించారు. మెట్రోలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించి ప్రత్యర్థులకు షాకిచ్చారు ఢిల్లీ సీఎం. జగన్ మాదిరిగానే కేజ్రీవాల్
కూడా సోషల్ మీడియానే ఆయుధంగా మార్చుకున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో పని చేసినప్పటికి కూడా లాభం లేకుండా పోయింది, జగన్
ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు. సరిగ్గా అదే మాదిరిగా కేజ్రీవాల్‌ను ఓడించడానికి అటు బీజేపీ పార్టీతో పాటు ఇటు
కాంగ్రెస్ పార్టీ కూడా పని చేసింది. కేజ్రీవాల్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరవలేదు. ఏపీలో కూడా జగన్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. కాని ఇవి
ఏమి కూడా కేజ్రీవాల్ చాణిక్యం ముందు పని చేయలేదు. ఏపీలో జగన్ ఎంతటి ఘన విజయం సాధించారో, ఢిల్లీలో కే్జ్రీవాల్ కూడా అంతటి ఘన విజయం
సాధించారు. వీరిద్దరు విజయంలో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చాలా కీలకంగా వ్యవహారించారు. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ కా బాప్ తానే అని మరోసారి నిరుపించారు కేజ్రీవాల్.