మొదటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం జగన్ అంటే పెద్దగా నచ్చదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2014
ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాని కారణం పవనే అని అంటారు వైసీపీ నాయకులు. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ పరోక్షంగా చంద్రబాబుకు
సహయం చేయలని చూశారు. కాని జగన్ ప్రభంజనం ముందు పవన్ సినిమా గ్లామర్ పని చేయలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం
సాధించింది. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ సీఎం అయిన తరువాత కూడా పవన్ ఎటువంటి మార్పు రాలేదు. జగన్‌కు వ్యతిరేకంగా
పవన్ పోరాటాలు చేస్తున్నారు. అలాంటి పవన్ కల్యాణ్ మొదటిసారి జగన్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని ప్రశంసించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మొట్ట మొదటిసారి వైఎస్ జగన్‌పై మంచిగా స్పందించారు. కర్నూల్ జిల్లాకు చెందని సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి
అప్పగించారు సీఎం జగన్. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగించినందుకు జగన్ కు ధన్యావాదాలు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి ఓ ప్రైవైట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సడన్‌గా స్కూల్లో సుగాలి ప్రీతి చనిపోయిందనే వార్తను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది స్కూల్ యాజమాన్యం. తమ అమ్మాయిని స్కూల్ యాజమాన్యమే అత్యాచారం చేసి , చంపారని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించింది. ఈ వార్త అప్పట్లో ఏపీలో హాట్ టాపిక్ గా కూడా మారింది. అప్పటి నుంచి సుగాలి ప్రీతి తల్లి న్యాయం కోసం పొరాడుతునే ఉంది. ఈ ఘటన చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జరిగింది. స్కూల్ యాజమాన్యం చంద్రబాబుకు సన్నిహితులు కావడంతో ఈ కేసులో న్యాయం జరగలేదు. జగన్ తన పాదయాత్ర సమయంలోనే సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మంగళవారం కర్నూల్ జిల్లాకు కంటి వెలుగు పథకం ప్రారంభానికి వెళ్లిన సీఎం జగన్‌కు సుగాలి ప్రీతి తల్లి తన కూతురు కేసులో న్యాయం చేయాలని కోరింది.
తప్పకుండా ఈ కేసులో న్యాయం జరగుతుందని హామీ ఇచ్చారు జగన్. కర్నూల్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకొగానే సుగాలి ప్రీతి హత్య
కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు జగన్ . ఈ కేసులో ఎంతటి వారున్న వదిలిపెట్టేది లేదని తేల్చిచేప్పారు. త్వరగతిన కేసును పూర్తి చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించారు జగన్. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం మంచి పరిణామమని పవన్ అభిప్రాయపడ్డారు.ఈ నిర్ణయం సుగాలి ప్రీతి
కుటుంబానికి ఊరట కల్గిస్తోందన్నారు. పాఠశాలకు వెళ్ళిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసినవాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూలు ప్రజలు
కోరుకుంటున్నారని పవన్ తెలిపారు. సీఎం జగన్‌ను అభినందిస్తూ ట్విట్టర్‌లో ఓ లేఖను కూడా పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. మొదటిసారి పవన్ ఇలా జగన్
పై పాజిటివ్ గా స్పందించడంతో వైసీపీ అభిమానుల్లో ఆనందం నెలకొంది. మరి దీనిపై జనసైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి.