కేజ్రీవాల్ ఇప్పుడు నేషనల్ లేవల్లో బాగా వినిపిస్తున్న పేరుది. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సీఎంగా ఘన విజయం సాధించారు అరవింద్ కేజ్రీవాల్. కాకలు
తీరిన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను కాదని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కు పట్టం కట్టారు ఓటర్లు. కేజ్రీవాల్ విజయం వెనుక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, పలు
కార్యక్రమాలు ఉన్నాయాని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కేజ్రీవాల్ విజయం సాధించడం పట్ల చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో సావాసం చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. చంద్రబాబుతో సావాసం చేసిన తరువాత తిరిగి
విజయం సాధించింది కేవలం కేజ్రీవాల్ మాత్రమే.

అవును ఇది నిజమే.. 2009లో టీఆర్‌ఎస్‌, సీసీఐ, సీపీఎం పార్టీలతో జత కట్టారు చంద్రబాబు. కాని వైఎస్‌ఆర్ రాజకీయం ముందు బాబుగారు ఘోరంగా
ఓడిపోయారు. వైఎస్‌ఆర్ చనిపోయేంత వరకు కేసీఆర్ బయట పెద్దగా కనిపించింది లేదు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు చంద్రబాబు. బాబుగారి
దెబ్బకు 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూడా విలవిల లాడిపోయింది. దీంతో చంద్రబాబు నుంచి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది, ఆ తరువాత మన పక్క రాష్ట్రం
అయిన కర్నాటకలో కూడా ఓ వేలు పెట్టారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించారు కుమారస్వామి. కుమారస్వామి సీఎం కావడం
వెనుక తన హస్తం కూడా ఉందని చెప్పుకున్నారు చంద్రబాబు. అలా చెప్పిన ఆరు నెలలు గడవకముందే కర్నాటకలో ప్రభుత్వాన్ని కొల్పోయ్యారు
కుమారస్వామి.

ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎలెక్షన్స్‌లో సైతం చంద్రబాబు పాదం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబుతో మొదటి నుంచి సన్నిహిత్యంగా ఉండే పశ్చిమ
బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సైతం షాకిచ్చారు చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నిల్లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న మమత పార్టీ , పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం
సీన్ రివర్స్ అయింది. మమతకు సపోర్ట్‌గా చంద్రబాబు అక్కడ ప్రచారం చేయడమే మమత ఓటమికి ప్రధాన కారణం అని చాలామంది చెబుతుంటారు. ఇలా
తన పాదం ఎక్కడ పెడితే అక్కడ నాయకులకు ఓటమిని అప్పగిస్తున్నారు చంద్రబాబు.

కాని కేజ్రీవాల్ ఒక్కడే చంద్రబాబు శని తప్పించుకున్నారని ఆప్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గతంలో చంద్రబాబుకు మద్దతుగా ఏపీలో ఎన్నికల
ప్రచారం కూడా నిర్వహించారు కేజ్రీవాల్. ఏపీ ప్రజలను చంద్రబాబు పార్టీకి ఓటు వేయమని కోరారు. కాని ప్రజలు చంద్రబాబును తిరస్కరించి జగన్‌కు పట్టం
కట్టారు. ఇలా చంద్రబాబు పాదం నుంచి తప్పించుకుంది కేవలం కేజ్రీవాలే అని ఏపీ ప్రజలు సైతం మాట్లాడుకుంటున్నారు. మొత్తనికి కేజ్రీవాల్ జనం మెచ్చిన
నాయకుడే కాకుండా… చంద్రబాబు నుంచి బయటపడి గెలిచిన నాయకుడని జనాలు చెప్పుకోవడం విశేషం.